ప్రభాస్ ను కాపీ కొట్టేసిన సల్మాన్ ఖాన్

Wed May 16 2018 23:21:42 GMT+0530 (IST)

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఇన్ స్పిరేషన్ తీసుకోవడం కామన్ అయిపోయింది. రీమేక్ లు మాత్రమే కాదు.. అడపాదడపా కాన్సెప్టులను తీసేసుకోవడం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు రిలీజ్ కాని సినిమాల నుంచి కూడా థీమ్ లను లేపేయడం.. అది కూడా సల్మాన్ ఖాన్ లాంటి హీరో సినిమాలో ఇలాంటి ఫీట్స్ కనిపించడం చర్చనీయాంశం అవుతోంది.రీసెంట్ గా సల్మాన్ ఖాన్ మూవీ రేస్3 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రతీ సారి ఈద్ పండుగకు సినిమా ఇచ్చే సల్లూ భాయ్.. ఇప్పుడు రేస్3 మూవీతో సక్సెస్ సాధిస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ చిత్రంలో పారాగ్లైడింగ్ ఫీట్ చేస్తూ.. సల్మాన్ ఖాన్ కనిపిస్తాడనే విషయం.. ట్రైలర్ లో ఓ సన్నివేశం ద్వారా అర్ధమవుతుంది. ఇలాంటి షాట్ ను.. దాదాపు ఏడాది క్రితమే టాలీవుడ్ చూపించేసింది. బాహుబలి2 మూవీతో పాటే ప్రభాస్ మరుసటి చిత్రం సాహోకు టీజర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సాహో టీజర్ లో చివరగా చూపించే షాట్ లో.. బుర్జ్ ఖలీఫా పై నుంచి ఓ వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ.. ఫీట్ చేస్తాడు. అప్పటికి గ్రాఫిక్స్ అయినా.. ఇప్పుడు రియల్ గానే ఆ షాట్ ను రూపొందిస్తున్నారు. కానీ ఈ ఫైట్ సీక్వెన్స్ థీమ్ ను రేస్3లో చూపించండం ఆలోచించాల్సిన విషయం. ప్రభాస్ సినిమాలో ఈ సీక్వెన్స్ ఉంటుందని తెలిసినా.. సల్మాన్ కాపీ చేసేయడం ఆశ్చర్యపరుస్తోంది. పారాగ్లైడింగ్ పై ప్రభాస్ కు పేటెంట్ రైట్స్ ఏమీ లేవు కానీ.. ఈ సన్నివేశం చూపించిన విధానం మాత్రం కాపీ అనే సంగతిని ధృవీకరించేస్తోంది.