Begin typing your search above and press return to search.

అతడి ముందు తాము వేస్ట్ అంటున్న సల్మాన్

By:  Tupaki Desk   |   22 Jun 2017 7:29 AM GMT
అతడి ముందు తాము వేస్ట్ అంటున్న సల్మాన్
X
బాలీవుడ్ అంటే ఖాన్స్.. ఖాన్స్ అంటే బాలీవుడ్. సినిమాల బిజినెస్.. కలెక్షన్లు.. ఇలా ఏది తీసుకున్నా రికార్డులు ఖాన్స్ పేరు మీదే ఉంటాయి. రికార్డుల మాట ఎలా ఉన్నా. . గత కొన్నేళ్లలో మంచి మంచి సినిమాలతో నిలకడగా హిట్లు కొడుతూ తన రేంజ్ బాగా పెంచుకున్నాడు అక్షయ్ కుమార్. క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే ఏడాది కనీసం రెండు మూడు రిలీజులుండేలా చూసుకుంటున్నాడు అక్షయ్. ఈ ఏడాది ఆల్రెడీ ‘జాలీ ఎల్ ఎల్బీ-2’ తో హిట్టు కొట్టిన అక్షయ్.. ఇండిపెండెన్స్ డే వీకెండ్ కోసం ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ను రెడీ చేశాడు. ఇలా శరవేగంగా సినిమాలు చేసుకుంటూ పోతున్న అక్షయ్ కుమార్ మీద సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రశంసలు కురిపించడం విశేషం.

అక్షయ్ ముందు తాను.. మిగతా ఖాన్ హీరోలు వేస్ట్ అనేశాడు సల్మాన్. అక్షయ్ ఏడాదికి మూడు సినిమాలతో దూసుకెళ్తున్నాడని.. ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు నిర్మాతల్ని నిలబెడుతున్నాడని.. వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడని.. హీరోలందరూ కూడా అక్షయ్ లాగే ఉండాలని సల్మాన్ అన్నాడు. తాను కూడా ఒకప్పుడు వేగంగా సినిమాలు చేశానని.. మధ్యలో జోరు తగ్గిందని.. కానీ ఇప్పుడు మళ్లీ వేగంగా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నాడు సల్మాన్. ఇకపై ఏటా కనీసం రెండు సినిమాలు విడులయ్యేలా చూసుకుంటానని సల్మాన్ అన్నాడు. సల్మాన్ కొత్త సినిమా ‘ట్యూబ్ లైట్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/