Begin typing your search above and press return to search.

సల్మాన్ కాకపోవడానికి కారణం ఇదా?

By:  Tupaki Desk   |   23 Feb 2018 5:04 PM GMT
సల్మాన్ కాకపోవడానికి కారణం ఇదా?
X
మన ఇండియన్ సినిమా పరిశ్రమలో హీరోలు పెళ్లి చెసుకొని ఆ తరువాత విడిపోయిన వారు చాలానే ఉన్నారు. లవ్ లో కొన్నేళ్ల వరకు మునిగి తెలి ఆ తరువాత ఒంటరిగా మిగిలిపోయిన వారు కూడా బాగానే ఉన్నారు. కానీ జీవితంలో అసలు అమ్మాయే వద్దు అనుకోని పెళ్లి చేసుకొని ఘనుడు ఒకే ఒక్కడు. అతనెవరో అందరికి తెలిసే ఉంటుంది. బాలీవుడ్ లో అత్యదిక పారితోషకం అందుకుంటున్న వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు. అలాగే అత్యధిక అభిమానులను సంపాదించిన వారిలో సల్మాన్ ఒకడు.

ముఖ్యంగా అమ్మాయిలు అయితే సల్మాన్ కండలకే పడిపోతారు. ఆ విధంగా ఎంతో మంది మనసులను దోచుకున్న సల్మాన్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదో అనే అనుమానం చాలా మందిలో ఇప్పటికి ఉంది. అది అలానే ఉంటుంది కూడా. మధ్యలో ఎన్నో రూమర్స్ వచ్చినా అది ఎంతవరకు నిజమో ఎవ్వరికీ తెలియదు. ఒక్క సల్మాన్ కి తప్ప. లేకుంటే ఆయన మాజీ లవర్ అంటారే ఆమెకు తెలియాలి. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా సల్మాన్ తను పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ రోజుల్లో పెళ్లికి ఏ స్థాయిలో ఖర్చుపెడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పు చేసి అయినా సరే పెళ్లి గ్రాండ్ గా చేస్తారు.

అయితే సల్మాన్ ఖాన్ పెళ్లి జరిగితే ఏ స్థాయిలో ఖర్చు అవుతుందో ఊహించడం కష్టమే. అంత ఉహించని డబ్బు కార్చుపెట్టడం సల్లు బాయ్ కి అస్సలు ఇష్టం లేదట. ఫైనల్ గా డబ్బు వల్లే పెళ్లి చెసుకోలేకపోతున్నాను అని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సల్మాన్ చెప్పింది నమ్మడానికి కష్టంగానే ఉంది కాని అదే నిజమని కొంచెం గట్టిగానే చెప్పాడు. తన పేరెంట్స్ అప్పట్లో 180 రూపాయల్లో వారి పెళ్లికి కార్చుపెట్టుకున్నారని అలాంటి డబ్బుతోనే ఐదు మందిని పెంచి పెద్ద చేశారని సల్మాన్ వివరించాడు. కానీ చాలా మంది సల్మాన్ చెప్పింది నమ్మడానికి కొంచెం డౌట్ గానే ఉందని మరి డబ్బు ఖర్చు వల్ల పెళ్లి చెలుకోపోవడం ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు.