Begin typing your search above and press return to search.

సల్మాన్ అక్షయ్ లతో ఆర్ ఆర్ ఆర్ ఫైట్

By:  Tupaki Desk   |   21 March 2019 7:08 AM GMT
సల్మాన్ అక్షయ్ లతో ఆర్ ఆర్ ఆర్ ఫైట్
X
ఇక్కడ ఫైట్ అంటే సినిమాలో అనుకునేరు. కాదు. బాక్స్ ఆఫీస్ వద్ద అని అర్థం. వచ్చే ఏడాది జూలై 30ని లాక్ చేసుకుని ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ని ప్రకటించిన రాజమౌళికి బాలీవుడ్ నుంచి పెద్ద సవాళ్లు ఎదురు కానున్నాయి. ఇంతకు ముందే అక్షయ్ కుమార్ దర్శకుడు రోహిత్ శెట్టి కాంబోలో రూపొందుతున్న సూర్యవంశికి అదే తేదిని ఫిక్స్ చేసుకున్నారు. జక్కన్న ప్రకటన తర్వాత అందులో మార్పు ఉండే సూచనలు కనిపించడం లేదు.

మరోవైపు 20 ఏళ్ళ తర్వాత చేతులు కలిపిన సల్మాన్ ఖాన్ సంజయ్ లీలా భన్సాలీల ఇన్షాఅల్లా కూడా ఈద్ పండుగ సందర్భంగా అదే రోజు రానున్నట్టు బాలీవుడ్ టాక్. అంటే జూలై 30నే కండల వీరుడి సినిమా బరిలో దిగుతుంది. ఇవే జరిగితే ఆర్ ఆర్ ఆర్ కు ఇబ్బందులు తప్పక పోవచ్చు.

దీనికి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ బాలీవుడ్ లో సాధారణంగా ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే డానికే కట్టుబడతారు. ఆర్ ఆర్ ఆర్ మీద ఎంత క్రేజ్ ఉన్నా పోటీలో సల్మాన్ అక్షయ్ ల సినిమాలు ఉన్నాయంటే ఖచ్చితంగా నార్త్ ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. రాజమౌళి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే బాగుండదు.

తప్పని పరిస్థితి వస్తే ఎవరూ ఏమి చేయలేరు కాని ఇప్పుడీ ట్రయాంగిల్ వార్ నుంచి ఎవరు తప్పుకుంటారు లేక ముగ్గురు పోటీకి సై అంటారా చూడాలి. ఒకవేళ పట్టుబడితే సల్మాన్ అక్షయ్ లకు సౌత్ లో థియేటర్లకు కొరత ఏర్పడుతుంది. అంతా ఆర్ ఆర్ ఆర్ మయంతో నిండి ఉంటుంది. సో చేతిలో సమయం ఉంది కాబట్టి ఓ అండర్ స్టాండింగ్ తో ఏదైనా నిర్ణయానికి వస్తారేమో చూడాలి