Begin typing your search above and press return to search.

సల్మాన్ జీరో అన్నాడని కత్రినా హర్టయి..

By:  Tupaki Desk   |   17 March 2018 5:30 PM GMT
సల్మాన్ జీరో అన్నాడని కత్రినా హర్టయి..
X
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఎదిగిన వాళ్లలో పెర్ఫామెన్స్ పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వాళ్లలో ముందుగా చెప్పాల్సిన పేరు కత్రినా కైఫ్. అందం తప్పితే ఆమెకు ఏ క్వాలిటీస్ లేవని విమర్శకులు ఎప్పుడూ ఎద్దేవా చేస్తుంటారు. ఐతే హీరోయిన్ల నటన సంగతి ఎలా ఉన్నా కనీసం డ్యాన్స్ విషయంలో అయినా ప్రావీణ్యం ఉండాలని ఆశిస్తారు జనాలు. ఐతే కత్రినా మొదట్లో అందులో కూడా చాలా పూర్. ఈ విషయంలోనూ కెరీర్ ఆరంభంలో చాలా విమర్శలు ఎదుర్కొంది. ఈ విమర్శలు తనదాకా కూడా వచ్చాయని.. దీంతో పట్టుదలతో తాను డ్యాన్స్ నేర్చుకుని అందరితో శభాష్ అనిపించుకున్నానని కత్రినా అంటోంది.

ఒక ఇంటర్వ్యూలో కత్రినా మాట్లాడుతూ.. డ్యాన్స్ విషయంలో తాను మొదట్లో ఎలా ఇబ్బంది పడిందో.. ఎలా విమర్శలు ఎదుర్కొన్నది వివరించింది. ‘‘తెలుగులో నేను నటించిన ‘మల్లీశ్వరి’ సినిమాలో డ్యాన్సులు సరిగా చేయలేకపోయా. నా విషయంలో డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం చాలా అసంతృప్తిగా ఉన్న విషయం ఆయన ముఖంలో హావభావాలు చూస్తేనే అర్థమయ్యేది. కానీ నన్నేమీ అనేవారు కాదు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నా గురించి ఒక కామెంట్ చేశారని తెలిసింది. నేను డ్యాన్సుల్లో జీరో అని ఒక మాస్టర్ దగ్గర వ్యాఖ్యానించినట్లు తెలిసి షాకయ్యాను. ఆ తర్వాతే నాలో పట్టుదల పెరిగింది. ప్రత్యేకంగా డ్యాన్స్ మాస్టర్ ను పెట్టించుకుని సాధన చేశాను. డ్యాన్సుల్లో పట్టు సాధించాను’’ అని కత్రినా వెల్లడించింది.