మహర్షి రీమేక్ గురించి కండల వీరుడి క్లారిటీ

Mon May 27 2019 16:22:30 GMT+0530 (IST)

ఏదో సునామి ప్రభంజనంలా యూనిట్ చెప్పుకున్న మహర్షి పట్టుమని ఇరవై రోజులు తిరక్కుండానే బాగా స్లో అయిపోయింది. వీకెండ్స్ లో డీసెంట్ రన్ వస్తున్నప్పటికీ మొదట్లో వచ్చిన డివైడ్ టాక్ అలాగే కొనసాగడంతో వీక్ డేస్ లో డ్రాప్ చాలా ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల నష్టాలు కూడా ఖాయమైయాయి. తానున్నన్నాళ్లు విపరీతమైన ప్రమోషన్ చేసిన మహేష్ అటు ఫారిన్ వెళ్ళగానే ఇటు మొత్తం సద్దుమణిగిపోయింది. అభిమానుల్లో సైతం అంత ఉత్సాహం ఏమి లేదు.పోతే మహర్షిని సల్మాన్ ఖాన్ రీమేక్ చేసేందుకు విపరీతమైన ఆసక్తి చూపుతున్నాడని మొదటివారంలో గట్టి ప్రచారమే జరిగింది. అయితే కండల వీరుడు వాటిని కొట్టి పారేశాడు. మహర్షిని ఇంతవరకు చూడలేదని తన కొత్త సినిమా భరత్ ప్రమోషన్స్ కే టైం లేనప్పుడు అది రీమేక్ చేసేంత సీన్ తనకు లేదని మీడియా సృష్టిని తనకు ఆపాదించవద్దని కోరాడు. సో సల్లు భాయ్ బాలీవుడ్ మహర్షిగా కనిపించేది అబద్దామన్న మాట.

ఒకవేళ పబ్లిసిటీ కోసం ఇలాంటి ఫీలర్ ను వాడుకున్నారా ఏమో తెలియదు కానీ నిజంగానే ఇది రీమేక్ చేసే ఆలోచన ఇతర స్టార్ హీరోలు చేయడం కూడా అనుమానమే. అన్నట్టు మహర్షి చూడని సల్మాన్ ఇటీవలే అఖిల్ హలో హిందీ డబ్బింగ్ టీవీలో చూశాడట. అది తప్ప ఇంకే తెలుగు సినిమా చూడలేదని కుండబద్దలు కొట్టేశాడు కాబట్టి రీమేక్ గురించి సందేహాలకు తెరపడినట్టే. భరత్ గురించి ఇంకేది అడగకండని మొహం మీదే చెప్పేస్తున్నాడు. ఈద్ పండగ సందర్భంగా భరత్ వచ్చే నెల 5న విడుదల కానుంది