అర్బాజ్ కు వందనోటు.. బీడీ ఇచ్చాడట!

Fri Mar 15 2019 11:10:22 GMT+0530 (IST)

సల్మాన్ ఖాన్ తమ్ముడు.. నటుడు అయిన అర్బాజ్ ఖాన్ రీసెంట్ గా 'పించ్' అనే చాట్ షో ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రధానంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎదుర్కొనే ట్రోల్స్ .. విమర్శల నేపథ్యంలో సాగుతుంది.  హోస్ట్ అయిన అర్బాజ్ సెలబ్రిటీలపై వచ్చిన ట్రోల్ కామెంట్స్ ను ప్రస్తావించి వారి స్పందనను కోరతాడు.  రీసెంట్ గా ఈ కార్యక్రమానికి కరీనా కపూర్ ఖాన్ గెస్ట్ గా విచ్చేసింది.కరీనాను అర్బాజ్ అడిగే ప్రశ్నలు అడిగాడు కానీ ఈ షో లో హైలైట్ గా నిలిచింది మాత్రం కరీనా అర్బాజ్ గురించి చేసిన కామెంట్.  అర్బాజ్ కొంత కాలం క్రితం ఐపీఎల్ బెట్టింగ్ లో పాలుపంచుకొని భారీగా డబ్బు పోగొట్టుకున్నాడనే విషయం తెలిసిందే.  ఈ విషయాన్ని ఒక నెటిజనుడు ట్రోల్ చేస్తే అర్బాజ్ నిజమేనని ఒప్పుకుంటూ తన డబ్బంతా పోయిందని చెప్తూ ఇప్పుడు తనదగ్గర అసలు డబ్బు లేదన్నాడు.  పించ్ షో లో కరీనా ఆ ట్వీట్ ను ప్రస్తావించింది.. 'థానే పోలీస్ అర్బాజ్ ఖాన్ పై జరుపుతున్న విచారణను పూర్తిగా ఆపేశారని సమాచారం. నిజానికి కానిస్టేబుల్ పాటిల్ అర్బాజ్ చేతిలో ఒక వంద నోటు.. బీడీ పెట్టి 'ఇంద తీసుకో.  మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్టెయిన్ చేస్తుండు. లేకపోతే బ్యాంక్ వారు ఫైన్ వేస్తారు' అన్నారట.'

ఈ ట్వీట్ ను కరీనా చదవగానే పెద్దగా నవ్వేసిన అర్బాజ్ 'అవును. అది నిజమే. నా ఎకౌంట్ లో డబ్బే లేదు' అన్నాడు.  కరీనా ఆ విషయాన్ని నమ్మలేదు.. 'ఏంటి నువ్వు జోక్ చేస్తున్నావా.. రెండు సూపర్ హిట్ సినిమాలను నిర్మించావు కదా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయన గారికి ఎన్ని ఖర్చులున్నాయో ఏంటో. ఆర్బాజ్ ఖర్చుల సంగతేమో గానీ ఈ పించ్ షో మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది.  నోటి దూల నెటిజనుల కామెంట్లకు సడెన్ గా ఫుల్ డిమాండ్ వచ్చేసింది.