ప్రీ లుక్: ఇది నిజంగానే అతని సినిమాయేనా?

Wed Oct 18 2017 15:37:53 GMT+0530 (IST)

చాలామంది డైరక్టర్లు ఒక రకమైన మూస సినిమాలను తీయడానికి అలవాటుపడిపోయి.. ఆ తరువాత ఇంకేం చేయరు. శ్రీను వైట్లను చూడండి.. ఆయన ఎన్ని ఫ్లాపులు తిన్నా కూడా ఆ ఫార్ములా నుండి మాత్రం బయటకు రాలేకపోతున్నాడు. అలాంటి డైరక్టర్లలో లక్ష్యం.. రామ రామ కృష్ణ కృష్ణ నుండి మొన్నటి డిక్టేటర్ వరకు తీసిన శ్రీవాస్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా పోస్టర్ చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే.''సాక్ష్యం'' అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇప్పుడు శ్రీవాస్ కూడా ఒక సినిమాతో వస్తున్న సంగతి తెలసిందే. ఈ సినిమా తాలూకు కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి ఇప్పుడు రిలీజ్ చేశారు. పంచ బూతాలన్నీ ఒక కన్ను షేపులో కనిపించేలా ఒక పోస్టర్ ను డిజైన్ చేశారు. ఆ మద్యలో హీరో సిలౌట్ ఒకటి కనిపిస్తోంది. చూస్తుంటే ఇదేదో పర్యావరణంతో మానవుని చెలగాటంకు సంబంధించిన కాన్సెప్ట్ అన్నట్లుంది. కాని పోస్టర్ చూశాక మాత్రం.. ఇప్పటివరకు శ్రీవాస్ తీసిన సినిమాలనూ దీనిని పక్కనెట్టి చూస్తే.. అతని సినిమాయేనా అనే సందేహం రాక మానదు.

అయితే ఈ మధ్యన చాలా సినిమాలు లోపల కంటెంట్ రొటీన్ గా ఉన్నా కూడా.. పైన ప్యాకేజింగ్ మాత్రం ఇలా అదరగొట్టేస్తున్నారు. మరి దుబాయ్ కాశి వంటి లొకేషన్లలో తీస్తున్న ఈ సినిమాలో నిజంగానే మ్యాటర్ ఉందా లేదంటే ఇలా పోస్టర్ ను మాత్రం ఆసక్తికరంగా క్రియేట్ చేశారా? అనే సంగతి తెలియాలంటే.. ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.