Begin typing your search above and press return to search.

సింగిల్‌గా జేమ్స్ బాండ్ జైత్రయాత్ర

By:  Tupaki Desk   |   28 July 2015 10:04 AM GMT
సింగిల్‌గా జేమ్స్ బాండ్ జైత్రయాత్ర
X
సింహం సింగిల్ గా వస్తుంది... ఇది రజనీకాంత్ చెప్పిన పాపులర్ డైలాగ్. టాలీవుడ్ లేటెస్ట్ లేడీ జేమ్స్‌ బాండ్ సాక్షి చౌదరి కూడా ఇదే ఫాలో అయిపోతోంది. రెండు రోజుల పాటు విజయయాత్ర నిర్వహించింది జేమ్స్ బాండ్ యూనిట్. శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకూ చుట్టేశారు వీరు. సెక్యూరిటీ అసలు ఏమాత్రం లేకుండా హీరోయిన్ సాక్షి చౌదరి ఈ టూర్‌ లో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

బాహుబలి తర్వాత వచ్చిన మూవీ కావడం, కామెడీ కూడా బాగానే పండడంతో.. కలెక్షన్లు బాగానే ఉన్నాయి సినిమాకి. జనాలు కూడా అల్లరి నరేష్ పడే పాట్లను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఒంటరిగానే సాక్షి ఈ టూర్‌ లో పాల్గొనడంతో... ఈ పిల్ల ధైర్యవంతురాలే అనుకున్నారు సినిమా యూనిట్ కూడా.

అయినా.. అందరు హీరోయిన్లకీ సెక్యూరిటీ కావాలి కానీ... జేమ్స్‌ బాండ్‌ కి ఎందుకు చెప్పండి! విలన్లని రఫ్పాడించే కేరక్టర్ చేసింది కదా... ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసినట్లుందీ గడుగ్గాయికి. అలాక్కాదు కానీ... ఓ మాటనుకుందాం... దండయాత్ర చేయడానికి వెనకాల పెద్ద టీంని వేసేందుకు వెళ్లాలి. ఇది ఆల్రెడీ బాక్సాఫీస్‌ ని గెలిచిన తర్వాత చేస్తున్న విజయయాత్ర కదా.. అందుకే సెక్యూరిటీ అక్కర్లేదు అనుకుందేమో సాక్షి.