లేడీ బాండ్.. కోటి ఆఫర్ ఇందుకేనా?

Mon Feb 11 2019 12:10:35 GMT+0530 (IST)

`జేమ్స్ బాండ్` సినిమాలో లేడీ బాండ్ గా అదరగొట్టేసిన సాక్షి చౌదరిని బోయ్స్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అంతకుముందే `ప్యార్ మే పడిపోయానే..` (పోటుగాడు) అంటూ కుర్రకారు గుండెల్లో తిష్ఠ వేసింది. అల్లరి నరేష్ మంచు మనోజ్ వంటి స్టార్ల సరసన నటించిన ఈ అమ్మడికి సరైన హిట్టు రాకపోవడం ప్రతిభను గుర్తించి అవకాశాలివ్వకపోవడంతో రేసులో వెనకబడింది. ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత `సువర్ణ  సుందరి` అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. సౌండ్ వింటే చావు గ్యారెంటీ! అనే కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమా కార్తికేయ సుబ్రమణ్య పురం తరహా థ్రిల్లర్ మోడ్ లో సాగనుందని ఇటీవలే రిలీజైన ట్రైలర్ చెబుతోంది.తన సినిమా రిలీజ్ ముంగిట సాక్షి చౌదరి ప్రచారంలో వేగం పెంచింది. ఆ క్రమంలోనే ఓ వివాదాన్ని నెత్తికెత్తుకుంది ఈ అమ్మడు. ఇటీవలే ఓ నెటిజన్ `ఒక్క రాత్రికి కోటి ఆఫర్ చేశాడు` అంటూ.. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అలా పోస్టింగ్ నిమిషాల్లోనే అంతర్జాలంలో జోరుగా వైరల్ అయిపోయింది. అయితే ఆ తర్వాత దానిని ఇన్ స్టా నుంచి డిలీట్ చేయడంపై వాడి వేడిగా చర్చ సాగింది. ఇదంతా పబ్లిసిటీ జిమ్మిక్ అని సాక్షి ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని విమర్శలొచ్చాయి. ఏదేమైనా సాక్షికి మళ్లీ ప్రచారం పరంగా మైలేజ్ పెరిగిందనే చెప్పాలి.

తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ మరో సెన్సేషన్ కి తెర తీసింది. ఈ సారి గులాబీ వర్ణం బికినీ ఫోటోని సామాజిక మాధ్యమంలో అభిమానులకు షేర్ చేసింది. ఈ బికినీలో సాక్షి బోల్డ్ లుక్ లో కనిపించింది. మతి చెడే అందాలు కుర్రకారుకు  కంటిపై కునుకుపట్టనీయని సన్నివేశం నెలకొంది. అయితే ఇలాంటి ఫోటోలు వీడియోలతో రెచ్చగొడితే యూత్ లో స్పందన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. తన ఫోటోలు వీడియోలు చూసి కోటి ఆఫర్ చేశారని చిందులు తొక్కిన సాక్షి అలాంటి న్యూడ్ ఫోటోలతో ఎరవేయడం సరైనదేనా? అంటూ మరోసారి యూత్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరి దీనికి సాక్షి దగ్గర ఏం ఆన్సర్ ఉందో?