Begin typing your search above and press return to search.

మ‌ణిర‌త్నంతో మెగా ఫ్లాప్ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   13 Oct 2015 5:30 AM GMT
మ‌ణిర‌త్నంతో మెగా ఫ్లాప్ హీరోయిన్‌
X
ఓకే బంగారం చిత్రంతో రేసులోకి వ‌చ్చారు మ‌ణిర‌త్నం. ఆ సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నా ఓ ఇంట్రెస్టింగ్ స్ర్కిప్టు రెడీ చేసుకుని కాస్టింగ్‌ని ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాలో హీరోల్ని ఫిక్స్ చేసుకున్న మ‌ణి స‌ర్ హీరోయిన్ల‌ను ఫైన‌ల్ చేసేశారు. కార్తీ, నాని హీరోలుగా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రికీ హీరోయిన్ల‌ను వెతికి పెట్టారు. నాని స‌ర‌స‌న క‌థానాయిక‌గా నిత్యామీన‌న్ ఎంపికైంది.

అలాగే కార్తీ స‌ర‌స‌న మ‌ల‌యాళ కుట్టి కీర్తి సురేష్ నాయిక‌గా న‌టిస్తుంద‌ని ప్ర‌చార‌మైనా మ‌ణిర‌త్నం ఆలోచ‌న మార్చుకున్నారో, లేక కీర్తికి కాల్షీట్ల స‌మ‌స్య త‌లెత్తిందో .. ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంది ఈ అమ్మ‌డు. ఇప్పుడు ఆ ప్లేసులోకి స‌యామీ ఖేర్ ఎంట‌రైంది. మెగా హీరో సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న రేయ్ చిత్రంలో న‌టించింది ఈ భామ‌. అయితే తెలుగులో తొలి సినిమానే బాక్సాఫీస్ వ‌ద్ద బాంబులా పేల‌డంతో స‌యామీకి ఇక్క‌డ కెరీర్ లేకుండా పోయింది. ఇప్పుడు ఓ అరుదైన అవ‌కాశం అందుకుంది.

ద‌ర్శ‌క‌మ‌ణి ఈ మెగా హీరోయిన్‌ ని కొత్త కోణంలో చూపిస్తాడ‌న‌డంలో సందేహ‌మేం లేదు. న‌టిగా తీర్చిదిద్దుతార‌న‌డంలో డౌటే అక్క‌ర్లేదు. కాబ‌ట్టి ఇక‌ముందు అయినా ఈ భామ కెరీర్ వెలుగుతుందేమో చూడాలి.