Begin typing your search above and press return to search.

పాక్ కళాకారుల విషయంలో షాకిచ్చిన సైఫ్!

By:  Tupaki Desk   |   28 Sep 2016 9:08 AM GMT
పాక్ కళాకారుల విషయంలో షాకిచ్చిన సైఫ్!
X
భారత్ పై తాజా ఉగ్రదాడి అనంతరం సీరియస్ గా స్పందించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన... పాకిస్థాన్ కు చెందిన కళాకారులంతా రెండు రోజుల్లో (48 గంటల్లో) భారత్ విడిచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ విషయంలో అలాంటి వాటికి బెదరొద్దని - భారత ప్రభుత్వం అనుమతితో ఇండియా వచ్చిన వారందరికీ రక్షణ దొరుకుతుందని ముంబై పోలీసులు ప్రకటించారు. అయితే ఈ విషయంలో తాజాగా బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ స్పందించారు. భారత్ లో ఎవరు ఉండాలో ఉండకూడదో నిర్ణయించేది కేవలం ప్రభుత్వం మాత్రమే అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పంపిణీ కార్యక్రమంలో ఈ విషయాలపై స్పందించిన సైఫ్... భారత్ లో ఎవరు పనిచేయాలి? ఎవరు పనిచేయకూడదు? అని చెప్పాల్సింది ఒక్క ప్రభుత్వం మాత్రమేనని.. టాలెంట్ ఉన్నవాళ్లందరికీ భారత చిత్ర పరిశ్రమ స్వాగతం పలుకుతుందని - ఆదరిస్తుందని సైఫ్ అన్నారు. కళల సంస్కృతిని మార్చుకోవడం అనేది కచ్చితంగా ప్రోత్సహించాల్సిన విషయమని.. ప్రపంచ వ్యాప్తంగా టాలెంట్ ఉన్నవారికి ఇక్కడ తలుపులు తెరిచే ఉంటాయని.. ఈ విషయం భారత్ సరిహద్దులో ఉన్న దేశాలకు కూడా వర్తిస్తుందని.. మిగిలిన విషయాలు ప్రభుత్వం చూసుకుంటుందని.. ఎవరిపై ఏ చర్యలు తీసుకోవాలనేది చట్టం ప్రకారం ప్రభుత్వం చేస్తుందని సైఫ్ చెప్పారు.

కాగా... మహారాష్ట్ర నవనిర్మాణ సేన వ్యాఖ్యల అనంతరం బాలీవుడ్ లో ఉంటున్న పాక్ నటుడు ఫవాద్ ఖాన్ రహస్యంగా దేశం విడిచి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇదే క్రమంలో మరికొంతమంది పాక్ కళాకారులు ఫవాద్ ఖాన్ ను అనుసరించొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/