కూతురు కోసం స్వయంగా రంగంలోకి దిగి..

Thu May 24 2018 22:19:58 GMT+0530 (IST)


బాలీవుడ్ హీరోలు ఒకప్పుడు వారి ఫ్యామిలీ నుంచి అమ్మాయిలను ఇండస్ట్రీలోకి పంపాలంటే ఎంత మాత్రం ఒప్పుకునే వారు కాదు కానీ గత అయిదేళ్ల నుంచి సినీ తారలా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. హీరోయిన్స్ గా సక్సెస్ అవుతుండడంతో మిగతా వారు కూడా వారి కూతుళ్లను పంపేందుకు సిద్దపడుతున్నారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కూడా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మొదటి సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది.అయితే అంతా క్లియర్ అనుకుంటున్నా సమయంలో ఆ సినిమా విడుదల అగినట్లు టాక్ వచ్చింది. అభిషేక కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన కేదర్ నాథ్ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ - సారా అలీ ఖాన్ జంటగా నటించారు. అయితే సినిమాకు సంబందించిన ఎదో విషయంలో సమస్య రావడం వలన సారా తండ్రి సైఫ్ అలీ ఖాన్ రంగంలో దిగినట్టు తెలుస్తోంది. ఇటీవల ముంబైలో అభిషేక్ కపూర్ ఆఫీస్ దగ్గర సైఫ్ తన కూతురుతో కనిపించాడు.

ఇద్దరు సీరియస్ గా ఆఫీస్ లోపలికి వెళ్లడంతో బాలీవుడ్ మీడియాలో అనేక రకాల రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ కు సంబందించిన విషయంలోనే ఎదో సమస్య వచ్చిందని అందుకే సైఫ్ సెటిల్మెంట్ చేశాడని చెబుతున్నారు. ఇక కేదర్ నాథ్ సినిమాతో పాటు సారా టెంపర్ రీమేక్ లో కూడా నటిస్తోంది. సీంమ్బా అని టైటిల్ ను కూడా సెట్ చేశారు. ఇక హీరోగా రన్ వీర్ సింగ్ నటిస్తున్నాడు.