Begin typing your search above and press return to search.

అందరికీ హీరో కూతురే కావాలి

By:  Tupaki Desk   |   28 May 2017 5:51 AM GMT
అందరికీ హీరో కూతురే కావాలి
X
హీరోల కొడుకులు అరంగేట్రం చేయడాని కంటే ముందు మంచి క్రేజ్ తెచ్చుకోవడం మామూలు విషయమే. మన దగ్గర అలాంటి కుర్రాళ్లు చాలామందిని చూశాం. మహేష్ బాబు.. రామ్ చరణ్.. అఖిల్‌ లాంటి హీరోల అరంగేట్రానికి ముందు హైప్ వచ్చిందో తెలిసిందే. బాలీవుడ్లోనూ కొందరు వారసత్వ హీరోలు ముందే మంచి క్రేజ్ సంపాదించారు. కానీ ఒక హీరో కూతురు అరంగేట్రానికి ముందే పిచ్చ క్రేజ్ తెచ్చుకోవడం అరుదు. సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ విషయంలో ఇలాగే జరుగుతోంది. ఆమె అరంగేట్రం కోసం బాలీవుడ్ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తోంది. ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయడానికి తహతహలాడిపోతున్నారు బాలీవుడ్ జనాలు.

శ్రీదేవి కూతురు జాహ్నవి విషయంలో లేని పోని హడావుడి చేసినట్లు కాకుండా.. జెన్యూన్ గా క్రేజ్ సంపాదించిన భామ సారా. ఈమెను ఇంట్రడ్యూస్ చేయడానికి కరణ్ జోహార్ లాంటి అగ్ర దర్శక నిర్మాత చాలా ఆసక్తిగా ఉన్నాడు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’ ద్వారా సారాను కథానాయికగా పరిచయం చేయాలని ముందు భావించిన కరణ్.. ఆ తర్వాత మనసు మార్చుకుని షారుఖ్ ఖాన్ తనయుడు హీరోగా నటించే సినిమాలో ఆమెను జోడీగా నటింపజేయాలనుకున్నాడు. ఈలోపు వేరే వాళ్లు సారాను ఇంట్రడ్యూస్ చేయడానికి పోటీ పడుతున్నారు. తాజాగా అభిషేక్ కపూర్.. యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ హీరోగా తెరకెక్కించబోయే ‘కేదార్ నాథ్’లో ఆమెను హీరోయిన్ గా నటింపజేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇంకా పలువురు దర్శక నిర్మాతలు సారాను కథానాయికగా పరిచయం చేయడానికి సైఫ్ అలీ ఖాన్ మీద ఒత్తిడి తెస్తున్నారు. మరి వారిలో సైఫ్ ఎవరికి అవకాశమిస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/