Begin typing your search above and press return to search.

మావయ్య సాంగ్స్ చేయడం ఇష్టంలే

By:  Tupaki Desk   |   30 April 2016 1:30 PM GMT
మావయ్య సాంగ్స్ చేయడం ఇష్టంలే
X
''అబ్బే.. నాకు అస్సలు సంబంధం లేదు.. నేను మావయ్య పాటలను రీమిక్స్‌ చేయడానికి అస్సలు ఇష్టపడను'' అంటున్నాడు సాయిధరమ్‌ తేజ్‌. అయితే మనోడు చెప్పే మాటలకు చేసే పనులకు పెద్దగా సంబంధం లేదనేది మెగాభిమానుల వాదన. పదండి చూద్దాం.

పవన్‌ కళ్యాణ్‌ తరహాలో సాయిదరమ్ కూడా నేషనల్‌ న్యూస్‌ ఏజన్సీలకు ఇంటర్యూలు ఇచ్చాడు. మరి తన ''సుప్రీమ్‌'' సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయట్లేదు కాని.. ఇలా ఇంటర్యూలు మాత్రం ఇస్తున్నాడు. ఇక మెగా ఫ్యాన్స్‌ మీరు అస్తమానం చిరంజీవి హిట్‌ సినిమా పాటలను రీమిక్స్‌ చేసి చెడగొడుతున్నారని కామెంట్‌ చేస్తున్నారు అంటే.. ''నాకస్సలు మావయ్య పాటలను రీమిక్స్‌ చేయడానికి ఇష్టమే లేదు. కాకపోతే నా నిర్మాతలూ దర్శకులూ నన్ను ఫోర్స్‌ చేయడం వలనే ఆ పాటలను రీమిక్స్ చేయాల్సి వస్తుంది'' అంటూ చెప్పుకొచ్చాడు సాయిధరమ్‌.

ఎంత వారు ఫోర్సు చేస్తే మాత్రం.. ఇలా మెగాస్టార్‌ పాటలన్నీ వాడేస్తాడేంటండీ? అని మెగా ఫ్యాన్ష్‌ ఎంత అడుగుతున్నా కూడా.. తన తదుపరి సినిమాలో ఏ పాటను రీమిక్స్‌ చేయాలో ఇప్పటికే ఆలోచించుకుని పెట్టుకుని ఉంటాడీ మెగా మేనల్లుడు అంటున్నారు సినిమా అభిమానులు.