Begin typing your search above and press return to search.

కాంప్ర‌మైజ్ కాదంటున్న హైబ్రిడ్ పిల్ల‌!

By:  Tupaki Desk   |   16 Jan 2018 11:28 AM GMT
కాంప్ర‌మైజ్ కాదంటున్న హైబ్రిడ్ పిల్ల‌!
X
సాయి ప‌ల్ల‌వి....ప్ర‌స్తుతం యూత్ తో పాటు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోన్న హైబ్రిడ్ పిల్ల‌. మ‌ల‌యాళం`ప్రేమ‌మ్` లో మ‌ల‌ర్ పాత్ర‌తో మెప్పించిన ఈ త‌మిళ‌మ్మాయి త‌న అందంతో.....అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. తెలంగాణ యాస‌లో...భానుమ‌తి పాత్రలో....పెంకిపిల్ల‌గా ప్రేక్ష‌కుల‌తోపాటు విమ‌ర్శకుల‌ను ఆక‌ట్టుకుంది. అయితే, భానుమ‌తి క్యారెక్ట‌ర్ లో `ఇగో`ను పండించిన సాయి ప‌ల్ల‌వికి నిజ జీవితంలో కూడా ఇగో ఎక్కువేన‌ని రూమ‌ర్లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఎంసీఏ సంద‌ర్భంగా నానికి, సాయి ప‌ల్ల‌వికి మ‌ధ్య ఇగో ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చాయ‌ని టాక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత అటువంటిదేమీ లేద‌ని నాని క్లారిటీ ఇచ్చేశాడు. ఆ త‌ర్వాత దిల్ రాజు చెప్పిన క‌థను సాయి ప‌ల్ల‌వి రిజెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రెమ్యున్ రేష‌న్ స‌రిపోక‌నే ఆమె ఆ క‌థ‌కు నో చెప్పింద‌ని పుకార్లు వ‌చ్చాయి. తాజాగా, ఆ పుకార్ల‌పై సాయి ప‌ల్ల‌వి స్పందించింది. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సాయి ప‌ల్ల‌వి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.

దిల్ రాజు బ్యాన‌ర్ లో న‌టించేందుకు హీరో హీరోయిన్లు ఆస‌క్తి చూపిస్తారు. అయితే, దిల్ రాజు సినిమాకు తాను నో చెప్పిన మాట వాస్త‌వ‌మేన‌ని సాయి ప‌ల్ల‌వి తెలిపింది. దిల్ రాజు చెప్పిన కథ తనకు నచ్చలేదని, అందుకే చేయ‌లేద‌ని తెలిపింది. అయితే, త‌న‌కు ఎక్కువ రెమ్యున్ రేష‌న్ ఆఫర్ చేసినా ఆ సినిమాను తిరస్కరించానని కొందరు ప్రచారం చేస్తున్నారని, వాటి గురించి తాను ప‌ట్టించుకోన‌ని చెప్పింది. కథ నచ్చకపోతే ఆ సినిమా చేయనని తేల్చి చెప్పింది. తాను దిల్ రాజుకే కాదు....ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు మణిర‌త్నం గారికి, విల‌క్ష‌ణ న‌టుడు విక్ర‌మ్ కి కూడా నో చెప్పాన‌ని సాయి ప‌ల్ల‌వి తెలిపింది. మ‌ణి సార్ దర్శకత్వంలో నటించాలని అంద‌రికీ ఉంటుంద‌ని, ఆయ‌న చెప్పిన క‌థ‌లో త‌న‌ పాత్రకి తగిన న్యాయం చేయలేన‌నిపించి ఆ సినిమాకి నో చెప్పానంది. క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతోనే విక్రమ్ గారితో ఓ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని వ‌దులుకున్నాన‌ని చెప్పింది. విక్ర‌మ్ ప‌క్క‌న హీరోయిన్ పాత్ర ప‌వ‌ర్ ఫుల్ గా ఉండాల‌ని, ఆ క‌థ‌లో త‌న పాత్ర‌ తేలిపోతుంద‌నిపించి చేయ‌లేద‌ని తెలిపింది. దీంతో, సాయి ప‌ల్ల‌వికి పొగ‌రు....రెండు సక్సెస్ లు రాగానే ఎవరి మాటా వినడం లేద‌ని ప్ర‌చారం జ‌రిగింద‌ని చెప్పింది. అయితే, తాను మాత్రం క‌థ‌లో విష‌యంలో, పాత్రల విష‌యంలో కాంప్ర‌మైజ్ కాన‌ని చెప్పింది.