సెన్సార్ దగ్గర కూడా విన్నరే!!

Fri Feb 17 2017 22:13:02 GMT+0530 (IST)

వచ్చే శుక్రవారం రిలీజ్ కు షెడ్యూల్ చేసిన సాయిధరంతేజ్ మూవీ విన్నర్.. ఇప్పుడు పూర్తి స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెన్సార్ కూడా పూర్తి చేసేసింది యూనిట్. ట్రైలర్ రిలీజ్ లేట్ కావడం.. ఫిబ్రవరి 12 నుంచి కొత్త పాటను చిత్రీకరించనున్నామని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పడంతో.. ఫిబ్రవరి 24న మూవీ రిలీజ్ పై కొన్ని సందేహాలు నెలకొన్నాయి.

వీటన్నిటినీ క్లియర్ చేసేస్తూ.. ఇప్పటికే సెన్సార్ కు పంపడం.. వారి నుంచి యూ/ఏ సర్టిఫికేట్ పొందడం కూడా పూర్తయిపోయింది. విశేషం ఏంటంటే.. విన్నర్ కు సెన్సార్ సభ్యులు కూడా ఒక్క కట్ కూడా సూచించలేదట. దీంతో క్లీన్ ఎంటర్టెయినర్ అనే విషయం అర్ధమైపోతోంది. ఒక్క కట్ కూడా పడకుండా సెన్సార్ దగ్గర కూడా విన్నర్ గా నిలిచాడు తేజు. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా.. ఆమె అందాలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.

మరోవైపు హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ చేయడం.. సూయా సూయా అంటే సాగా ఆ పాటను మరో యాంకర్ సుమ పాడడం మరీ స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది. సీనియర్ నటుడు జగపతి బాబు.. ఠాకూర్ అనూప్ సింగ్ లు విలన్స్ గా నటించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విన్నర్ పాటలు మార్మోగిపోతూ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/