Begin typing your search above and press return to search.

MCA చదవనున్న నాని.. సాయి పల్లవి

By:  Tupaki Desk   |   22 April 2017 5:08 AM GMT
MCA చదవనున్న నాని.. సాయి పల్లవి
X
ఫామ్ లో బ్యాట్స్ మెన్ ఎలాంటి బాల్ కి అయినా షాట్ షాట్ ఎలా షాట్ కొట్టగొలడో.. హీరో ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్న నాని.. అలాగే ఓ మోస్తరు సినిమా చేసినా హిట్ అయిపోతోంది. తాజాగా నేను.. లోకల్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ నేచురల్ స్టార్.. కొత్త సినిమాలు ఒప్పుకోవడంలో కూడా అంతే స్పీడ్ చూపిస్తున్నాడు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను మే నెలలో లాంఛ్ చేయనున్నాడు నాని. ఈ చిత్రంలో నాని సరసన మలయాళ ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవిని ఎంపిక చేశారు. ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఫిదా చిత్రంలో నటిస్తున్న సాయి పల్లవికి.. ఆ వెంటనే మరో క్రేజీ ఆఫర్ దక్కడం విశేషం. నాని-సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీకి 'ఎంసీఏ' అని టైటిల్ ను ఫిక్స్ చేశారు. సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ మూవీలో కీలక పాత్ర చేయనుండగా.. మాజీ హీరోయిన్ భూమికా చావ్లా సిస్టర్ రోల్ లో కనిపించనుందని తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నాడు. మే నెల రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం 'నిన్ను కోరి' చిత్రాన్ని పూర్తి చేసేస్తున్న నాని సమ్మర్ చివరలో ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/