అంతా సాయి పల్లవి వల్లేనా...

Tue Feb 20 2018 05:00:01 GMT+0530 (IST)

ఎలాగైతే ఏంటి సినిమాలో నటన సంగతి తరువాత సినిమా హిట్టయ్యిందా లేదా అనేది చాలా ముఖ్యం. ఈ విషయం గురించి క్రిటిక్స్ ఎన్నివిధాలుగా కామెంట్ చేసినా ఆడియెన్స్ అస్సలు పట్టించుకోరు. ఎంతో కొంత కలెక్షన్స్ అందుకుందా.. నమ్మి డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతలకు నాలుగు రూపయలు వచ్చాయా లేదా  అనేదే పాయింట్. ఈ తరహాలోనే దాదాపు అన్ని సినిమాలు తెరకెక్కుతాయి. ఇక ఆ సినిమాల్లో సోలో పర్ఫెమెన్స్ ఇచ్చిన వారి వల్ల ఇతర తారలకు కూడా ఎంతో కొంత ఇమేజ్ వస్తోంది.ఆ తరహాలోనే సాయి పల్లవి వల్ల మెగా హీరో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాడు. అతను ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. కెరీర్ లో మంచి హిట్ కోసం చూస్తోన్న మెగా యువ హీరో వరుణ్ తేజ్ ఫిదా సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో వరుణ్ పెర్ఫార్మెన్స్  ఎంతవరకు సెట్ అయ్యిందో గాని సాయి పల్లవి నటన అయితే సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. దానికి తోడు శేఖర్ కమ్ముల బ్రాండ్ డైరెక్షన్ కూడా వరుణ్ కి ప్లస్ అయ్యింది. ఓ విధంగా శేఖర్ కమ్ములకి కూడా సాయి పల్లవి చాలా హెల్ప్ అయ్యిందని చెప్పాలి.

ఫిదా సినిమాతో డైరెక్టర్ హీరో సెట్టయ్యారు. అంతే కాకుండా 50 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని ఫిదా ఈజీగా అందుకుంది. ఇక ఆ క్రేజ్ వరుణ్ తొలిప్రేమ కి కూడా మంచి హెల్ప్ అయ్యింది. లవర్ బాయ్ గా వరుణ్ అందరికి తెగ నచ్చేశాడు. తొలిప్రేమ మంచి టాక్ ను సొంతం చేసుకొని 20కోట్ల షేర్స్ ని అందించింది. దిల్ రాజు కూడా చాలా రోజుల తరువాత పంపిణీ దారుడిగా కొన్ని లాభాలను చూశాడు. మొత్తంగా సాయి పల్లవి క్రేజ్ వరుణ్ కెరీర్ కి ఎంతో కొంత హెల్ప్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ తీయబోయే సంకల్ప్ సినిమాతో వరుణ్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.