Begin typing your search above and press return to search.

ఆటో న‌డుపుతున్న ఫిదా పిల్ల‌

By:  Tupaki Desk   |   18 May 2018 8:11 AM GMT
ఆటో న‌డుపుతున్న ఫిదా పిల్ల‌
X
‘ప్రేమ‌మ్’ సినిమాతో మ‌ల‌యాళీ యువ‌త‌ను ప్రేమ‌లో ప‌డేసిన మ‌లార్‌... ‘ఫిదా’ సినిమాతో ఇక్క‌డికొచ్చి భానుమ‌తిగా టాలీవుడ్ జ‌నాల‌ను మాయ‌లో ప‌డేసింది. ఒకే ఒక్క సినిమాతో ఇంత పాపులారిటీ తెచ్చుకున్న భామ బహుశా సాయిప‌ల్ల‌వి ఒక్క‌తేనేమో! ఆ త‌ర్వాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ప‌క్క‌న ఆడిపాడిన ఈ హైబ్రీడ్ పిల్ల‌... ఇప్పుడు కోలీవుడ్లో య‌మా బిజీగా సినిమాలు చేస్తోంది.

మొద‌టి సినిమా మ‌ల‌యాళంలో చేసినా... సాయిప‌ల్ల‌వి ప‌క్కా త‌మిళ పొన్నుయే. దాంతో సొంత ప‌రిశ్ర‌మ‌తో గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దామ‌నుకున్న సాయిప‌ల్ల‌వికి ‘దియా’ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక‌పోయింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఆడ‌క‌పోయినా సాయిప‌ల్ల‌వి యాక్టింగ్ స్కిల్స్ ఏంటో త‌మిళ జ‌నాల‌కు రుచి చూపించింది సాయి ప‌ల్ల‌వి. ఇప్పుడు ఆమె చేతిలో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ధ‌నుష్ హీరోగా తెర‌కెక్కితున్న ‘మారి 2’ చిత్రంలో న‌టిస్తున్న సాయిప‌ల్లవి- సూర్య స‌ర‌స‌న ‘ఎన్‌.జీ.కే’లోనూ క‌నిపించ‌బోతోంది. అయితే ఊర మాస్ సినిమాగా రూపొందుతున్న మారి2 సినిమాలో ఆటో డ్రైవ‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంద‌ట సాయి ప‌ల్ల‌వి. ఇందుకోసం స్పెష‌ల్ క్లాసులు తీసుకుని ఆటో నేర్చుకుంద‌ట‌.

‘ఫిదా’ సినిమాలో ట్రాక్ట‌ర్ న‌డిపి.. పొలం దున్నిన సాయిప‌ల్ల‌వి... త‌మిళంలో ఆటో న‌డిపి అక్క‌డి వారిని ప‌డేయ‌నుంద‌న్న మాట‌. బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ధ‌నుష్ త‌న సొంత బ్యాన‌ర్ వండ‌ర్ బార్ ఫిల్మ్స్ దీన్నిప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.