ఫిదా పాపను బాధపెడుతున్న తెలుగు మీడియా

Fri Oct 13 2017 13:58:56 GMT+0530 (IST)

సాయి పల్లవి ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఫిదా మూవీ రిలీజ్ కి ముందు హీరో వరుణ్ తేజ్ 'పల్లవి వస్తోంది జాగ్రత్త' అనిచెప్పినట్లుగానే.. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరికీ టఫ్ కాంపిటీషన్ అయిపోయింది. మూడంటే మూడు సినిమాలు మాత్రమే చేసిన ఈ సుందరి.. ఇప్పుడు చాలా మంది మేకర్స్ కు ఫస్ట్ ఛాయిస్ అయిపోయింది.ప్రస్తుతం నాని నటిస్తున్న ఎంసీఏ చిత్రంలో ఈ భామ నటిస్తోంది. రీసెంట్ గా మహానుభావుడుతో హిట్ కొట్టిన శర్వానంద్ సినిమా కోసం కూడా సాయి పల్లవిని సంప్రదించారట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉండగా.. ఒకటి నివేదా థామస్.. మరొకటి సాయి పల్లవి పోషిస్తారని టాక్. అయితే.. తెలుగు మీడియా జనాలు ఈమెను మలయాళ బ్యూటీగానే గుర్తిస్తున్నారు. మల్లుబ్యూటీ అంటూ సాయి పల్లవి గురించి రాసుకువస్తున్నారు. ఇందుకు కారణం మలయాళ ప్రేమమ్ మూవీ సాధించిన సక్సెస్ రేంజ్.

ఈ మలయాళీ బ్యూటీ అనే మాటే సాయి పల్లవిని తెగ చిరాకు పెట్టించేస్తోందట. ఇందుకు కారణం.. నిజానికి సాయి పల్లవి ఓ తమిళియన్. మలయాళ మూవీ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది తప్ప మల్లు బ్యూటీ కాదు. కోయంబత్తూర్ లో పుట్టిన సాయి పల్లవి పక్కా తమిళియన్. కానీ ఆ పాయింట్ ను పట్టించుకోకుండా.. మాటికోసారి మల్లు బ్యూటీ అంటుంటే.. తెగ విసుక్కుంటోందట ఈ భామ.