మళ్లి మళ్ళి శర్వా పల్లవి

Sun Apr 15 2018 21:00:01 GMT+0530 (IST)

మామూలుగా ఏదైనా హీరో హీరొయిన్ కాంబినేషన్ ఒకటి రెండు సినిమాలు హిట్ అయ్యాక రిపీట్ అవుతుంది. కాని శర్వానంద్-సాయి పల్లవి కాంబో మాత్రం దానికి భిన్నంగా తమ మొదటి సినిమా విడుదల కాకుండానే మరోసారి సెట్ కాబోతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచె మనసులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ నిర్మాతలు ప్రసాద్-సుధాకర్ లు మరో ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేసారు. ఇటీవలే నీది నాది ఒకే కథతో విమర్శకులతో కూడా ప్రశంశలు అందుకున్న కొత్త దర్శకుడు వేణు ఊడుగులతో కొత్త ప్రాజెక్ట్ కి స్టేజి సెట్ అయిపోయింది. ఇందులో కూడా శర్వానందే హీరోగా నటించబోతున్నాడు. హీరొయిన్ గా మళ్ళి సాయి పల్లవినే ఫిక్స్ చేసారు. అంటే వరసగా రెండు సినిమాలలో ఒకే హీరో హీరొయిన్ తో పాటు నిర్మాత కూడా సేం అన్నమాట. దర్శకుడు మాత్రమే మారతాడు.దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 1990లో జరిగిన ఒక వాస్తవిక సంఘటన ఆధారంగా దర్శకుడు వేణు ఈ కథ రాసుకున్నట్టు టాక్. రంగస్థలం మేనియాలో కొట్టుకుపోయింది కాని ఇంకొంచెం స్పేస్ దొరికి ఉంటే నీది నాది ఒకే కథ ఇంకాస్త బాగా పెర్ఫార్మ్ చేసేదే. టైమింగ్ రాంగ్ కావడంతో లిమిటెడ్ రన్ తో సర్డుకుపోవాల్సి వచ్చింది. ఆ కథకు భిన్నంగా చాలా వెరైటీ బ్యాక్ డ్రాప్ తో వేణు స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు అది బాగా నచ్చడం వల్లే శర్వానంద్-సాయి పల్లవి మరోసారి కలిసి నటించేందుకు పచ్చ జెండా ఊపినట్టు తెలిసింది. గతంలో వెంకటేష్-సౌందర్య నాగార్జున-రమ్యకృష్ణ చిరంజీవి-రాధా ఇలా ప్రత్యేకించి హిట్ పెయిర్స్ అంటూ ఉండేవి. ఇప్పుడు శర్వానంద్ మళ్ళి ఆ రోజుల్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాడు.  షూటింగ్ ప్రారంభ తేది తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సాయి పల్లవి కణం తమిళనాడు ధియేటర్ల సమ్మె వల్ల విడుదల కాకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఎంసిఎ తర్వాత తెలుగులో తన కొత్త సినిమా ఏది రాలేదు.