Begin typing your search above and press return to search.

మెగా హీరోతో 'ప్రేమమ్‌' బ్యూటీ?

By:  Tupaki Desk   |   28 May 2016 5:30 PM GMT
మెగా హీరోతో ప్రేమమ్‌ బ్యూటీ?
X
అసలు మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ కొత్త సినిమా ఎప్పుడు బిగిన్‌ అవుతుందో తెలియదు కాని.. మనోడి తదుపరి నటించే ఇంకో సినిమా గురించి చాలా వార్తలే వస్తున్నాయి. శ్రీను వైట్లతో మనోడు చేయాల్సిన ''మిష్టర్‌'' మాటేమోగాని.. ఇప్పుడు ఫోకస్‌ అంతా శేఖర్‌ కమ్ముల డైరక్షన్‌ లో దిల్‌ రాజు ప్రొడ్యూస్ చేసే సినిమా మీదనే పెట్టినట్లున్నారు.

ఇప్పటికే శేఖర్‌ కమ్ముల చెప్పిన ఒక లవ్‌ స్టోరో బాగా నచ్చేయడంతో.. వరుణ్‌ ముందుగా ఆ సినిమానే మొదలెట్టేద్దాం అనుకుంటున్నాడని టాక్‌. మొన్నటివరకు కేవలం టాక్‌ గానే ఉన్న ఈ సినిమా గురించి ఇప్పుడు కొన్ని సీరియస్‌ విషయాలు తెలుస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్టయిన ''ప్రేమమ్‌'' సినిమాకు ప్రాణం పోసింది మలార్‌ అనే క్యారెక్టర్ లో నటించిన సాయి పల్లవి. ఆ మధ్యన మణిరత్నం సినిమా అన్నారు కాని.. అమ్మడు మాత్రం కేవలం మలయాళం సినిమాలే చేస్తోంది. ఇప్పుడు శేఖర్‌ కమ్ముల సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ సరసన ఆమెను అడిగితే.. ఓకె అన్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా వరుణ్‌ తేజ్‌ ఏదో ఒక ప్రాజెక్టు త్వరగా మొదలెడితే బెటర్‌. ఆల్రెడీ లోఫర్ రిలీజయ్యి ఓ సంవత్సరం అయిపోయింది అనే ఫీలింగ్ లో ఉన్నారు అభిమానులు.