ఫ్యామిలీతో సాయి పల్లవి నవ్వులు

Tue Apr 17 2018 10:19:34 GMT+0530 (IST)

చెన్నై బ్యూటీ సాయి పల్లవి.. మలయాళ మూవీ ప్రేమమ్ తో విపరీతమైన గుర్తింపు సంపాదించేసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ.. ఫిదా మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ ను నిజంగానే ఫిదా చేసేసింది. ఆ తర్వాత ఎంసీఏ మూవీతో కూడా మరో సూపర్ హిట్ సాధించి.. స్టార్ హీరోయిన్ రేంజ్ అనిపించేసుకుంది.బోలెడంత ట్యాలెంట్ ఉన్న సాయి పల్లవి.. రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటుంది. ఆన్ స్క్రీన్ పై కనిపించిన దానికంటే సింపుల్ గా సాధారణ జీవితంలో ఉంటుంది. అంతే కాదు.. ఏ పార్టీల్లోను పాల్గొన్నట్లు కానీ.. సెలబ్రిటీ ఈవెంట్స్ కు అటెండ్ అయినట్లు కానీ ఈమె గురించి వార్తలు రావు. పైగా సోషల్ మీడియాలో తెగ కనిపించేసే భామ కూడా కాదు. అందుకే సాయి పల్లవి ఏ చిన్న అప్డేట్ పెట్టినా బోలెడంత క్రేజ్ వస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ తన తల్లి.. చెల్లెలితో కలిసి దిగిన ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది.

తన చెల్లెలు పూజ కన్నన్.. తల్లి రాధ కన్నన్ తో కలిసి సాయి పల్లవి నవ్వులు పూయిస్తున్న ఫోటో భలే ఆకట్టుకుంటోంది. సినిమాల్లో మిడిల్ క్లాస్ పాత్రల్లో కనిపించడమే కాదు.. వాస్తవంగా కూడా ఈమె ఇప్పటికీ అదే స్థాయిలోనే జీవించడం విశేషం. తమిళనాడులోని కోయంబత్తూర్ దగ్గరలో నివాసం ఉంటున్న సాయి పల్లవి.. ఇప్పటికీ మిడిల్ క్లాస్ లైఫ్ లోనే ఉందనే సంగతి ఈ సెల్ఫీ ద్వారా అర్ధం అవుతుంది.