ఫిదా బ్యూటీ ఆటో క్వీన్

Thu Nov 08 2018 13:05:50 GMT+0530 (IST)

ఫిదా బ్యూటీ సాయి పల్లవి కెరీర్ స్పీడ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ - అటుపై తెలుగులో రీమేక్ ప్రేమమ్ రెండిటితో తన పేరు సౌత్ లో మార్మోగిపోయింది. అందం కంటే నటన - అభినయంతోనే ఈ అమ్మడి పాపులారిటీ .. ఫాలోయింగ్ పెరిగిందంటే అతిశయోక్తి కాదు. పరిశ్రమలో ఎందరో అగ్ర కథానాయికలు - అందగత్తెలు ఉన్నా - అందరిలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటూ సాయి పల్లవి కెరీర్ బండిని పరుగులు పెట్టిస్తోంది. అగ్రనిర్మాణ సంస్థలు - స్టార్ హీరోలు  పిలిచి అవకాశాలిస్తామనే రేంజు సంపాదించుకుంది.ఫిదా తర్వాత లైకా సంస్థ నిర్మించిన కణం చిత్రంతో తమిళ్ - తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫలితం మాట ఎలా ఉన్నా మరోసారి తన నటనకు మాత్రం మంచి మార్కులే వేయించుకుంది. వీటితో పాటే హీరోలతో గిల్లి కజ్జాలాడే అమ్మాయిగా సాయి పల్లవి పేరు యూత్ నోళ్లలో నానింది. అదంతా సరే సాయి పల్లవి ప్రస్తుతం ఏ చిత్రంలో నటిస్తోంది? అంటే మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వం లోనే నటిస్తోందని వార్తలొచ్చాయి.

మరోవైపు తమిళ స్టార్ హీరో ధనుష్ సరసన మారి 2 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఆన్ లొకేషన్ స్టిల్స్ కొన్ని ఇదివరకూ రిలీజై ఆకట్టుకున్నాయి. అప్పుడే ఫిదా బ్యూటీ ఆటోరాణిగా హల్ చల్ చేస్తోందన్న వార్తలు వచ్చాయి. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక లుక్ ని దీపావళి కానుకగా చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ ఫోటోలో నే ఆటోవాడ్ని.. ఆటోవాడ్ని అన్న తీరుగా ఖాకీ చొక్కా తొడుక్కుని మగరాయుడునే తపలించింది. ఇంకా చెప్పాలంటే బాషా సినిమాలో రజనీకాంత్ అంత ఊర మాస్ లుక్ లో కనిపించి షేక్ చేసింది. ఆనంది ఆరతు ఆనంది అంటూ కొత్త లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మారి 2 రిలీజైతే మరోసారి సాయి పల్లవి పేరు మార్మోగిపోవడం ఖాయం. అలానే సాయిపల్లవికి ఉన్న క్రేజు దృష్ట్యా - రఘువరన్ బిటెక్ తో ధనుష్ కి పెరిగిన గుర్తింపు దృష్ట్యా తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఛాన్సుంది.