Begin typing your search above and press return to search.

​సాయి పల్లవి రూట్ మార్చిందిగా

By:  Tupaki Desk   |   18 Aug 2017 6:12 AM GMT
​సాయి పల్లవి రూట్ మార్చిందిగా
X
సౌత్ సినిమా ఇండస్ట్రిలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన సాయి పల్లవి నామమే జపిస్తున్నారు. మలయాళం సినిమాలో అయితే ఇప్పటికే టాప్ యంగ్ హీరోలతో సినిమాలు చేసి హిట్ కూడా కొట్టింది. ఇక్కడ మన తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే టాప్ హీరోయిన్లు చేసినంత సందడి చేసింది. అసలు తెలుగులోకి రావడంతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో వచ్చిన సాయి పల్లవి. నిన్న ‘ఫిదా’ సినిమా హిట్ తరువాత తెలుగులో బిజీ హీరోయిన్ గా మారింది. ఫిదా ఇంకా విడుదల కాకముందే ఓ రెండు సినిమాలను తన ఖాతాలో వేసుకొంది. ఇప్పుడు మరో హారర్ థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం పట్టేసింది.

సాయి పల్లవి ఇంతవరకు మంచి అమ్మాయిగా అందరూ ప్రేమించాలని అనుకునే అమ్మాయిలా కనిపించింది. కానీ మొదటసారి ఈ హారర్ సినిమాలో సీరియస్ రోల్ చేయబోతుంది. థ్రిల్లర్ సినిమాలో ఉండే మలుపులు సాయి పల్లవి నటన ఈ సినిమాకు ప్లస్ అవ్వబోతున్నాయిని నమ్మకంగా చెబుతున్నారు ఆ టీమ్. ఈ కథలో ఉండే ట్విస్ట్ లు సాయి పల్లవికి తెగ నచ్చేశాయి అంటా అందుకనే విన్న వెంటనే ఓకే చెప్పేసింది అని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ప్రేమమ్ టీచర్ నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఒక సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా కూడా ఒకటి రెండు నెలలో విడుదల కావచ్చు. ఇదే కాకుండా నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ (MCA) సినిమా కూడా ముగింపు దశకు వచ్చింది అని చెబుతున్నారు. బహుశా ఈ రెండు సినిమాలు దగ్గర దగ్గరలోనే విడుదల కావచ్చు.

ఇప్పుడు ఓకే చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా కూడా తొందరలోనే షూటింగ్ మొదలుకావచ్చు అని తెలుస్తుంది. ఈ సినిమా గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియకపోయినా అతి తొందరలోనే అన్నీ విషయాలు తెలియజేస్తాం అని చెబుతున్నారు ఆ సినిమా డైరక్షన్ టీమ్. ఇప్పుడు అయితే వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ పనిని పూర్తి చేసే పని లో ఉన్నారు.​