మహేష్ సిస్టర్ డైరెక్షన్ లో ప్రేమమ్ బ్యూటీ

Thu Jan 12 2017 12:17:57 GMT+0530 (IST)

మలయాళీ ప్రేమమ్ తో కేరళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది సాయి పల్లవి. సహజమైన అందంతో విపరీతంగా ఆకట్టుకున్న ఈ బ్యూటీకి దక్షిణాది మొత్తం క్రేజ్ సంపాదించేసుకుంది. ఇప్పటికే తెలుగులో ఓ మూవీ చేస్తోందీ చిన్నది.

వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. తెలుగులో మొదటి మూవీ ఇంకా రిలీజ్ కాకుండానే.. తెలుగు మరో సూపర్బ్ ఛాన్స్ ను సాయి పల్లవి పట్టేసింది. కుర్ర హీరో సందీప్ కిషన్ కి హీరోయిన్ ఓ మూవీ చేసేందుకు సైన్ చేసిందీ భామ. షో.. ఆరెంజ్ వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకున్న మహేష్ బాబు సోదరి మంజుల ఈ మూవీ ద్వారా డైరెక్టర్ గా పరిచయం కానుండడం విశేషం. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రంలో సందీప్ కిషన్ పూర్తిగా మేకోవర్ చేయనున్నాడట. ఇందుకోసం ఇప్పటికే వర్కవుట్స్ ను కూడా స్టార్ట్ చేసేశాడని తెలుస్తోంది.

గోవా.. లండన్.. తోపాటు ఇండియాని మరికొన్ని ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందట. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఈ చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం రెండు నెలల టైంలోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేయడం విశేషం. టెక్నికల్ టీంను ప్రస్తుతం ఫైనల్ చేసే పనిలో ఉన్నారు నిర్మాత జెమినీ కిరణ్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/