Begin typing your search above and press return to search.

రౌడీ బేబీ రికార్డులకు ముగింపు లేదా?

By:  Tupaki Desk   |   18 March 2019 5:38 PM GMT
రౌడీ బేబీ రికార్డులకు ముగింపు లేదా?
X
ధనుష్‌ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌ గా రూపొందిన 'మారి 2' చిత్రం ఒక మోస్తరుగా ఆడింది. తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైన 'మారి 2' చిత్రం ధనుష్‌ మునుపటి సినిమాల స్థాయిలో వసూళ్లను రాబట్టడంలో విఫలం అయ్యిందని చెప్పాలి. అయితే 'మారి 2' లోని రౌడీ బేబీ సాంగ్‌ మాత్రం సౌత్‌ ఇండియా సినీ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకు పోతోంది. రౌడీ బేబీ యూట్యూట్‌ లో పోస్ట్‌ చేసిన కొద్ది రోజుల్లోనే వంద మిలియన్‌ ల వ్యూస్‌ ను దక్కించుకుంది. రెండు నెలల లోపులోనే రెండు వందల మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ రౌడీ బేబీ మూడు వందల వ్యూస్‌ ను దక్కించుకుంది.

సౌత్‌ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు సంబంధించిన వీడియో కాని, పాట కాని ఈ స్థాయిలో వ్యూస్‌ ను దక్కించుకోలేదు. రౌడీ బేబీ పాట వ్యూస్‌ ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాల పాటలను టార్గెట్‌ చేసింది. మరో రెండు నెలల పాటు ఇదే జోరు కొనసాగితే మాత్రం అయిదు వందల మిలియన్‌ వ్యూస్‌ ను దక్కించుకుని సరికొత్త రికార్డును నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. రెండు నెలలుగా రౌడీ బేబీ సాంగ్‌ యూట్యూబ్‌ లో రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఈ రికార్డుల పరంపరకు ముగింపు ఎప్పుడు అనేది తెలియడం లేదు. చూస్తుంటే అయిదు వందల మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుని బాలీవుడ్‌ రికార్డులను బద్దలు కొట్టి కూడా వ్యూస్‌ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది.