Begin typing your search above and press return to search.

స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన హైబ్రిడ్ పిల్ల

By:  Tupaki Desk   |   16 Aug 2017 4:32 AM GMT
స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన హైబ్రిడ్ పిల్ల
X
ఫిదా సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన సాయిపల్లవికి ఇప్పుడు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. నాని, నాగశౌర్య తదితరుల సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది ఈ పింపుల్స్ బ్యూటీ. అయితే ఈ రెండిట్లో ఓ సినిమాలో సాయి పల్లవి దెయ్యం గెటెప్ లో కనిపించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే సారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల అవుతున్న ఆ సినిమా పూర్తిగా హారర్ జానర్ తో తెరకెక్కబోతుందని తెలిసింది. సాయి పల్లవి మరోసారి తన హావభావలతో సినీజనాల్ని ఆకట్టుకోవడం ఖాయం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసిన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని కథలు వింటున్న ఈ రైజింగ్ హీరోయిన్ ఇటీవలే ఓ స్టార్ హీరో సరసన నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేసిందని ఫిల్మ్ నగర్ లో ఓ వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరనే టాపిక్ పై ఫిల్మ్ సర్కిల్స్ మధ్య సీరియస్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. తాజాగా పాపులారిటీ తెచ్చుకున్న ఓ యంగ్ హీరో అప్ కమింగ్ మూవీలో ఛాన్స్ ఇస్తే సాయిపల్లవి రిజెక్ట్ చేసిందని, అందుకే నార్త్ నుంచి ఓ హీరోయిన్ ని దిగుమతి చేసుకొని ఆ స్టార్ హీరో సరసన నటింపచేస్తున్నారని టాక్. మరి స్టార్ హీరోలకి కూడా షాక్ ఇస్తున్న సాయిపల్లవి స్టార్ రానున్న రోజుల్లో ఏ రేంజ్ లో వెలుగుతుందో చూడాలి.