ఒక్క మల్టీస్టారర్నే ఒకే చేసిందట

Tue Dec 12 2017 16:03:11 GMT+0530 (IST)


ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న ఫిదా బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ లో అవకాశాలను బాగానే అందుకుంటోంది. ఆమె నటించిన ప్రతి సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుండడంతో దర్శకులు సాయి పల్లవికి తగ్గట్టు క్యారెక్టర్స్ ని సృష్టించి మరి సెలెక్ట్ చేసుకుంటున్నారట. కానీ ఈ మలయాళీ బ్యూటీ మాత్రం తనకు నచ్చిన కథలను మాత్రమే చేస్తోంది. అంతే కాకుండా కథలో మ్యాటర్ ఉంటేనే ఒకే చేస్తోంది.ఇకపోతే మొదటి సినిమా ఫిదా తర్వాత సాయి మరో తెలుగు చిత్రంతో రాబోతోంది. నాని - MCAలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల డిసెంబర్ 21న ఆ సినిమా రిలీజ్ కానుంది. అయితే సాయి పల్లవికి ఈ మధ్య రెండు మల్టి స్టారర్ ఆఫర్స్ వచ్చాయి. కానీ అందులో ఒక కథను మాత్రమే ఒకే చేసింది. రాజా ది గ్రేట్ దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మల్టి స్టారర్ కథను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అందులో వెంకటేష్ ఒకే అవ్వగా రానా ని మరో కథానాయకుడిగా ఎంచుకోవాలని అనుకుంటున్నారు. F2 అని టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు అనిల్. అయితే ఇటీవల సాయి పల్లవికి కథ వినిపించగా ఆమె సున్నితంగా తరస్కరించిందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం.

కానీ హరీష్ శంకర్ మల్టి స్టారర్ కథను మాత్రం ఒకే చేసిందని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఆ సినిమాలో నితిన్ - శర్వానంద్ హీరోలుగా నటించబోతున్నారు. ఇక సాయి పల్లవి హీరోయిన్ గా దిల్ రాజు ప్రొడక్షన్ లో మూడోసారి నటించడానికి రెడీ అయ్యిందని తెలుస్తోంది. అయితే అనిల్ - హరీష్ కథలు రెండు కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులు. మరి రెండు ఒకే తరహాలో ఉన్నాయి అనుకుందా లేక అనిల్ కథ నచ్చలేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఫిదా బ్యూటీ మాత్రం రెమ్యునరేషన్ కి అతీతంగా తనకు ఇష్టమైతేనే చేస్తోందట.