Begin typing your search above and press return to search.

సాయి ప‌ల్ల‌వి మిస్సింగ్?

By:  Tupaki Desk   |   26 Sep 2018 1:30 AM GMT
సాయి ప‌ల్ల‌వి మిస్సింగ్?
X
తెలంగాణ యాస‌ - భాష‌ - వేషం ఈ మూడింటికి పెర్ఫెక్ట్‌ గా మ్యాచ్ అయ్యే ఏకైక‌ క‌థానాయిక ఎవ‌రు? అని ఫ‌జిల్ వేస్తే వెంట‌నే వినిపించే పేరు సాయి ప‌ల్ల‌వి. అంత‌గా `ఫిదా` చిత్రంలో ఒదిగిపోయి న‌టించింది ఈ మ‌ల‌యాళ కుట్టి. ప్రేమ‌మ్ త‌ర్వాత ఫిదా సాయిప‌ల్ల‌వి కెరీర్‌ కి గొప్ప మైలేజ్‌ నిచ్చింద‌న‌డంలో సందేహం లేదు. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన `కణం` ఆశించిన విజ‌యాన్ని ఇవ్వ‌క‌పోయినా సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌కు మాత్రం పేరొచ్చింది. అందుకే ఈ అమ్మ‌డిని న‌మ్మి సినిమా తీస్తే త‌ప్పేం లేద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫిక్స‌యి అందుకు తగ్గ క‌థ‌ల్ని ఎంచుకుంటున్నారు. నాయికా ప్ర‌ధాన చిత్రాల‌కు సాయి ప‌ల్ల‌వి ఓ ఆప్ష‌న్‌ గానూ మారింది.

ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి.. శ‌ర్వా స‌ర‌స‌న `ప‌డిప‌డి లేచే మ‌న‌సు` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. హ‌ను రాఘ‌వ‌పూడి లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. సాయిప‌ల్ల‌వి ఇందులో కోల్‌ కత్తాకు చెందిన‌ మెడిసిన్ విద్యార్థిగా న‌టిస్తోంది. అక్టోబ‌ర్‌ తో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి, డిసెంబ‌ర్ 21న సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌నేమో.. సాయిప‌ల్లవి సంద‌డి ఇటీవ‌ల మిస్స‌య్యిందని అభిమానులు భావిస్తున్నారు. చాలా రోజులైంది ఈ బ్యూటీ సంద‌డి క‌నిపించి!

ఇక `ప‌డిప‌డి లేచే మ‌న‌సు` త‌ర్వాత‌ శేఖ‌ర్ క‌మ్ముల చిత్రంలో సాయిప‌ల్ల‌వి న‌టించ‌నుందని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే దీనికి ఇంకా అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. క‌మ్ముల ప్రస్తుతం అంతా కొత్త కుర్రాళ్ల‌తో ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. చియాన్ విక్ర‌మ్ కుమారుడు ధ్రువ్ ఈ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతార‌ని ప్ర‌చార‌మైనా, దానిపైనా స‌రైన‌ క్లారిటీ లేదు. ఇక శ‌ర్వానంద్ కి `మ‌హానుభావుడు` త‌ర్వాత‌ లాంగ్ గ్యాప్‌ తో వ‌స్తున్న సినిమా..ప‌డిప‌డి లేచే మ‌న‌సు. సాయిప‌ల్ల‌వితో ఇంట్రెస్టింగ్ ల‌వ్ ట్రాక్‌ లో శ‌ర్వా మెస్మ‌రైజ్ చేస్తాడ‌ట‌. శ‌త‌మానం భ‌వ‌తి - మ‌హానుభావుడు చిత్రాల‌తో విజ‌యాలు అందుకుని ఇప్పుడు మ‌రో హిట్టుపైనా క‌న్నేశాడట‌.