Begin typing your search above and press return to search.

ఆ భయంతోనే సాయి పల్లవి పెళ్లికి దూరం

By:  Tupaki Desk   |   12 Feb 2019 1:14 PM GMT
ఆ భయంతోనే సాయి పల్లవి పెళ్లికి దూరం
X
మలయాళం, తెలుగు, తమిళంలో నటిస్తూ సౌత్‌ ఇండియా మొత్తం అభిమానులను ఏర్పర్చుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. తెలుగులో 'ఫిదా' చేసిన ముద్దుగుమ్మ మంచి డిమాండ్‌ ను కలిగి ఉంది. అయితే ఆచి తూచి మాత్రమే సినిమాలకు కమిట్‌ అవుతుంది. ప్రస్తుతం ఈమె దృష్టి ఎక్కువగా తమిళ సినిమాలపై ఉన్నట్లుండి. ఇక్కడ ఒక్కటి చేస్తే అక్కడ రెండు చేస్తోంది. వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోను అంటూ తేల్చి చెప్పింది.

పెళ్లి చేసుకోకుండా ఉండి జీవితాంతం తల్లిదండ్రులకు తోడుగా ఉంటాను అంటోంది. పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులను విడిచి ఉండాల్సి వస్తుందేమో అనే భయంతోనే తాను పెళ్లికి నో అంటోందట. పెళ్లి చేసుకుంటే నేను నా తల్లిదండ్రుల సంరక్షణ పూర్తిగా చూసుకోలేనేమో అనే భయం ఉంది. నాకు అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం, మాది అత్యంత సంతోషకరమైన ఫ్యామిలీ, మా సంతోషకరమైన ఫ్యామిలీలో మరొకరు దూరడం నాకు ఇష్టం లేదు. కొత్తగా వచ్చే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో, అతడి వల్ల నా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారో లేదో అనే అనుమానం నాకు ఉందని, అందుకే పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది.

తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం మంచి పద్దతే, మంచి నిర్ణయమే, కాని అందుకోసం పెళ్లి వద్దనుకోవడం ఏంటీ, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవచ్చు. జీవితంలో పెళ్లి అనేది తప్పనిసరి, తల్లిదండ్రులను చూసుకున్నా కూడా ఆ తర్వాత అయినా తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి. అందుకే సాయి పల్లవి నిర్ణయాన్ని మార్చుకుంటే బెటర్‌. సాయి పల్లవి ఇదే నిర్ణయంపై ఉంటుందో లేక ఆమె నిర్ణయంను మార్చుకుంటుందో చూడాలి.