సాయిపల్లవికి బాగానే గిట్టుబాటు అయ్యింది

Tue Jan 22 2019 07:00:01 GMT+0530 (IST)

అదృష్టం ఒక్కసారి వరించడం మొదలుపెడితే.. మనకు నెగిటివ్ అయిన విషయం కూడా పాజిటివ్ గా మారిపోతుంది. అసలు ఏది ఎందుకు ఎలా కలిసివస్తుందో కూడా అర్థం కాదు. ఆ అదృష్టాన్ని సరదాగా ఎంజాయ్ చెయ్యాలంటే. ప్రస్తుతం ఇదే టైప్ అదృష్టాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది సాయిపల్లవి.సాయిపల్లవికి తమిళ ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకోవాలని ఆశ. ప్రేమమ్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో దుమ్ముదులిపేసింది. అందుకే తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది. ధనుష్ పక్క మారి 2 సినిమాతో మాంచి పేరు వస్తుందని అంచననావేసింది. కానీ ఏం చేస్తాం తెలుగు తమిళ భాషల్లో మారి 2 అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఇదే టైమ్ లో సాయి పల్లవి అదృష్టం బాగా పనిచేసింది. మారి 2లో రౌడీ బేబీ సాంగ్.. యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే ఈ పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ పాట దెబ్బకు సాయిపల్లవి మంచి హీరోయిన్ మంచి డ్యాన్సర్ అనే విషయం కేవలం తమిళ ఇండస్ట్రీకే కాదు టోటల్ ఇండియాకే తెలిసింది.    

ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు కేవలం మూడంటే మూడు పాటలు వండర్స్ క్రియేట్ చేశాయి. మొదటిది కొలవెరి. ఫిదా సినిమా రాకముందు వరకు కొలవెరి పాట ఉండేది. ఆ తర్వాత ఫిదా సినిమాలో వచ్చిండే సాంగ్ వచ్చింది. ఇప్పుడు రౌడీ బేబీ సాంగ్. మొత్తం ఈ మూడు పాటల్లో కామన్ గా ఉంది ధనుష్ అండ్ సాయిపల్లవి. దీంతో.. ఇప్పుడు వీరిద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.