Begin typing your search above and press return to search.

భల్లా కానిస్టేబుల్ భానుమతి నక్సలైట్!

By:  Tupaki Desk   |   13 Dec 2018 6:20 AM GMT
భల్లా కానిస్టేబుల్ భానుమతి నక్సలైట్!
X
నీది నాది ఒకే కథ' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వేణు ఉడుగుల తన నెక్స్ట్ సినిమా కోసం మరో ఇంట్రెస్టింగ్ కథ తయారు చేసుకున్నాడట. మొదట్లో ఈ సినిమాకు హీరోగా శర్వానంద్ ను అనుకున్నారటగానీ ఫైనల్ గా హీరో మారాడట. రానా దగ్గుబాటి ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

'విరాటపర్వం 1992' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోందట. ఈ సినిమాలో హీరో హీరోయిన్ పాత్రల గురించి తాజాగా ఒక టాక్ వినిపిస్తోంది. రానా ఈ సినిమాలో ఒక పోలీసు కానిస్టేబుల్ గా నటిస్తాడట. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపిస్తుందని.. కానిస్టేబుల్ రానా లవ్ లో పడిపోతుందని అంటున్నారు. అసలే పీరియడ్ స్టొరీ.. పైగా భల్లాలదేవుడు కానిస్టేబుల్.. భానుమతేమో నక్సలైట్.. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు ఇంతకంటే డిఫరెంట్ కాంబినేషన్ ఏముంటుంది చెప్పండి?

రానా ఇప్పటికే విభిన్నకథలు.. పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. సాయి పల్లవి కూడా అంతే.. ఎంతో నచ్చితేగానీ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. ఇద్దరూ కలిసి మొదటి సారి నటించడం కూడా సినిమా ప్లస్ అయ్యే అంశమే.