Begin typing your search above and press return to search.

బాహుబలి మిస్.. #RRR మిస్ కాలేదు!

By:  Tupaki Desk   |   20 Sep 2018 8:55 AM GMT
బాహుబలి మిస్.. #RRR మిస్ కాలేదు!
X
SS రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ మల్టిస్టారర్ #RRR కు ప్రీ-ప్రొడక్షన్ జోరుగా సాగుతోందన్న విషయం అందరికీ తెలిసిందే. దసరాకు ఈ సినిమాను లాంచ్ చేస్తారని వచ్చే ఏడాది జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

తన మాటల పదునుతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుని క్రేజీ ప్రాజెక్ట్ లకు మాటల రచయితగా పనిచేస్తున్న బుర్రా సాయిమాధవ్ ను రాజమౌళి #RRR కోసం తీసుకున్నారట. ఇప్పటికే 'సైరా'.. 'ఎన్టీఆర్' లాంటి సినిమాలతో పాటుగా ఇతర కమిట్మెంట్లు ఉన్నప్పటికీ రాజమౌళి ఆఫర్ ను స్వీకరించాడట. నిజానికి బాహుబలి సినిమాకు బుర్రా మాటల రచయిత గా పని చేయాల్సిందని కాకపొతే వేరే సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా 'బాహుబలి' ని మిస్ అయ్యాడట. సో.. ఈసారి రాజమౌళి కూడా మిస్ చేయకుండా బుర్రాను ఏరి కోరి తీసుకున్నాడట.

ఇప్పటికే అగ్రిమెంట్స్ సైన్ చేయడం జరిగిందని.. త్వరలో డైలాగ్స్ రాసే పని మొదలు పెడతాడని సమాచారం. జస్ట్ రాజమౌళి సినిమా అంటేనే దేశమంతా ఎదురుచూస్తుంది. రామ్ చరణ్.. ఎన్టీఆర్ లతో ఇదో భారీ మల్టిస్టారర్ గా మారింది. ఇక వీరితో పాటు విజయేంద్ర కథకు బుర్రా మాటలు తోడైతే ఇక బాక్స్ ఆఫీస్ కు జింతాత జిత జిత ఖాయం!