‘జై లవకుశ’లో ఆయన రోల్ ఏంటి?

Wed Sep 13 2017 17:11:32 GMT+0530 (IST)

‘జై లవకుశ’ సినిమా అంతా ప్రధానంగా జై-లవ-కుశ పాత్రల చుట్టూనే తిరిగేలా ఉంది. పక్కా మాస్ మసాలా సినిమాలా కనిపిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని భావిస్తున్నారు. ఈ సినిమా టీజర్.. ట్రైలర్లలో కూడా హీరోయిన్లకు పెద్దగా ఛాన్స్ ఇవ్వలేదు. ఐతే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తర్వాత సాయికుమార్ బాగా హైలైట్ అవుతాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ చివరగా నటించిన ‘జనతా గ్యారేజ్’లో సాయికుమార్ పోలీస్ కమిషనర్ గా కీలక పాత్ర పోషించాడు. అందులో ఎన్టీఆర్ ను రౌడీయిజం ఆపమని అంటాడు సాయికుమార్.ఐతే ‘జై లవకుశ’కు వచ్చేసరికి జై పాత్ర చేసే అరాచకాలకు ఆయన అండగా ఉండబోతున్నారు. ఈ చిత్రంలో జై పాత్రకు కుడి భుజంగా ఉంటుందట సాయికుమార్ పాత్ర. ఇన్నాళ్లూ సాయి కుమార్ పాత్రను దాచేసిన చిత్ర బృందం.. తాజా పోస్టర్లలో ఆయనకు చోటు కల్పించింది. ఆయన గెటప్ ఆకట్టుకుంటోంది. ఊరికే హీరో పక్కనుండే పాత్ర కాకుండా ఆయన కథలో కీలకంగా ఉంటారట. సినిమాకు ఈ పాత్ర కూడా ఆకర్షణగా ఉంటుందంటున్నారు. ఈ రోజే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ‘జై లవకుశ’ వచ్చే గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యు-ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘జై లవకుశ’ను ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మించిన సంగతి తెలిసిందే.