Begin typing your search above and press return to search.

రాజశేఖర్, సుమన్ ఎందుకు గొడవపడ్డారు?

By:  Tupaki Desk   |   8 Feb 2016 7:30 PM GMT
రాజశేఖర్, సుమన్ ఎందుకు గొడవపడ్డారు?
X
సాయికుమార్ ఇప్పుడు నటుడిగా మారి మంచి స్థాయిని అందుకున్నా.. తనకంటూ ఆయన ఓ గుర్తింపు తెచ్చుకుంది మాత్రం డబ్బింగ్ ఆర్టిస్టుగానే. వందల సినిమాలకు డబ్బింగ్ చెప్పి దేశంలోనే ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టుల్లో ఒకడిగా ఎదిగాడు సాయికుమార్. వాయిస్ తోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న అరుదైన ఆర్టిస్టుల్లో అతనుకొడు. ముఖ్యంగా 80లు, 90ల్లో రాజశేఖర్ - సుమన్ లిద్దరికీ డబ్బింగ్ చెప్పి చాలా గొప్ప పేరు సంపాదించాడు సాయికుమార్. అతను లేకుండా సినిమానే చేయలేని పరిస్థితి వచ్చింది. ఐతే అప్పట్లో రాజశేఖర్ - సుమన్ ఇద్దరూ కూడా స్టార్ హీరోలే. మరి ఇద్దరికీ ఒకడే వాయిస్ ఇవ్వడం అనేది చిత్రమైన విషయం. ఈ విషయంలో ఇద్దరికీ ఎలా సమన్వయం కుదిరింది.. సాయికుమార్ వాళ్లిద్దరినీ ఎలా ఒప్పించి డబ్బింగ్ చెప్పాడు అన్నది ఆసక్తికరం.

ఐతే ఈ వ్యవహారం అంత సాఫీగా ఏమీ సాగలేదని.. దీనిపై గొడవలు కూడా జరిగాయిని వెల్లడించాడు సాయికుమార్.
‘‘ముందు నేను సుమన్ కే డబ్బింగ్ చెప్పేవాణ్ని. ఐతే టి.కృష్ణగారి వందేమాతరం సినిమాలో సుమన్ - సుహాసిని హీరో హీరోయిన్లని అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో సుమన్ జైలుకు వెళ్లడంతో ఆయన స్థానంలో రాజశేఖర్ ను తీసుకున్నారు. రాజశేఖర్ కు ఘంటసాల గారి అబ్బాయి రత్నకుమార్ డబ్బింగ్ చెప్పాడు. కానీ అతడి వాయిస్ నచ్చక కృష్ణగారు నన్నే చెప్పమన్నారు. చెప్పారు. ఆ వాయిస్ బాగా పాపులర్ అయింది. రాజశేఖర్ తర్వాతి సినిమాలకు కూడా నన్నే కంటిన్యూ కమ్మన్నారు. తర్వాత సుమన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినపుడు తనకు డబ్బింగ్ చెప్పొద్దని గొడవ పెట్టాడు. రాజశేఖర్ కూడా స్టార్ ఇమేజ్ సంపాదించి.. తనకు మాత్రమే డబ్బింగ్ చెప్పాలని, సుమన్ కు వద్దని అన్నాడు. ఐతే మా అమ్మ ఇద్దరికీ సర్దిచెప్పి.. ఇద్దరికీ కొంచెం వేరియేషన్ తో నేను డబ్బింగ్ చెప్పేలా ఒప్పించింది’’ అని సాయికుమార్ వెల్లడించాడు.