Begin typing your search above and press return to search.

ఆ మెగా హీరోతో వారాహి చేయట్లేదంట

By:  Tupaki Desk   |   15 May 2018 7:42 AM GMT
ఆ మెగా హీరోతో వారాహి చేయట్లేదంట
X
చిన్న సినిమాల‌ను ప్రొడ్యూస్ చేయ‌డంలో వారాహి ముందుంటుంది. చిన్న హీరోలను కొత్త హీరోల‌ను ప్రోత్స‌హిస్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం వారాహి ద్వారానే చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచే మ‌రో హీరోను కూడా వారాహి సంస్థే లాంచ్ చేయ‌బోతోందంటూ వార్త‌లు వ‌చ్చాయి. వాటిని కొట్టిప‌డేసింది వారాహి సంస్థ‌.

టాలీవుడ్‌లో ఇప్ప‌టికే ప‌ది మంది దాకా మెగా హీరోలు ఉన్నారు. ఇప్పుడు మ‌రో హీరో ( చిరు చిన్న‌ల్లుడు)ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఇంకా చాల‌న‌ట్టు మ‌రో హీరో లాంచింగ్‌ కు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అత‌నెవ‌రో కాదు సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ట‌వ్ తేజ్‌. అన్న‌లాగే త‌మ్ముడికి కూడా సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్ప‌టికే ఎన్నో క‌థ‌లు కూడా విన్నాడ‌ట‌. ఏవీ న‌చ్చ‌క బండి ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. కాగా అత‌డిని లాంచ్ చేసే బాధ్య‌త కూడా వారాహినే తీసుకుంద‌ని వార్త‌లు వినిపించాయి. అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వైష్ణ‌వ్‌ ప‌రిచ‌యం కానున్నాడ‌ని గాసిప్స్ వ‌చ్చాయి. వాటిని అవ‌స‌రాల ఇప్ప‌టికే కొట్టి ప‌డేశాడు. అలాంటిదేం లేద‌ని తేల్చి చెప్పాడు. ఇప్పుడు వారాహి సంస్థ కూడా అదే విష‌యాన్ని చెప్పింది. తాము వైష్ణ‌వ్ తేజ్‌ని ప‌రిచ‌యం చేయ‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చింది.

వైష్ణ‌వ్ తేజ్ ఏ పెద్ద ప్రొడ్యూస‌రో వ‌చ్చి త‌న ఎంట్రీకి మార్గం సుగ‌మం చేస్తాడ‌న్న ఆశ‌తో ఉన్న‌ట్టున్నాడు. ఇప్ప‌టికే ఎన్నో ఫోటో షూట్‌ లు ఆడిష‌న్లు కూడా జ‌రిగాయి. కానీ ఫ‌లితం లేదు. మ‌రెవ‌రూ ఈ మెగా హీరోని లాంచ్ చేస్తారో చూడాలి. అయినా చిరంజీవి అనుకుంటే వైష్ణ‌వ్ తేజ్ లాంచ్ ఎంత‌సేపులెండి. చిరు పిలిస్తే ఏ ద‌ర్శ‌క నిర్మాత‌లు కాదంటారు?