Begin typing your search above and press return to search.

ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా మెగా హీరో

By:  Tupaki Desk   |   27 Aug 2016 6:27 AM GMT
ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ గా మెగా హీరో
X
సాయిధరమ్ తేజ్ 'తిక్క' సినిమా ఫ్లాపుతో చాలా ఫీలయ్యాడు. అందుకే ఆ తరువాత మీడియాలో ఎక్కడా కూడా కనిపించలేదు. ఓన్లీ చిరంజీవి 61వ బర్త్ డే వేడుకల్లో మాత్రం మెరిశాడు. ఈ తిక్క హీరో కొత్త సినిమా ఈరోజు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇంతకీ గోపిచంద్ మలినేని డైరక్షన్ లో రూపొందనున్న ఈ సినిమా కాన్సెప్టు ఏంటి? అసలు మనోడు ఎటువంటి పాత్రను పోషిస్తున్నాడు.

ఇప్పటికే కొత్త హెయిర్ స్టయిల్ తో కనిపిస్తున్న సాయిధరమ్ తేజ్.. ఆ లుక్కును ముంబయ్ లో డిజైన్ చేయించాడట. ఒక ప్రముఖ సెలూన్.. అలాగే పాపులర్ హెయిర్ స్టయిలిస్ట్ మనోడి లుక్ ను డిజైన్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో సాయిధరమ్ ఒక ఫ్యాషన్ డిజైనింగ్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా పనిచేస్తున్నాడట. అందుకే తను కూడా చాలా ఫ్యాషనబుల్ గా కనిపించాలని చాలా కేర్ తీసుకుంటున్నాడు మెగా మేనల్లుడు. ఇప్పటికే ఒక సినిమా మ్యాగజైన్ ను సొంతంగా నడిపిన అల్లు శిరీష్‌ దగ్గర నుండి టిప్స్ తీసుకున్న తేజ్.. వేరే ఇతర ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ఎడిటర్ల దగ్గర నుండి కూడా అనేక టిప్స్ తీసుకున్నారట. గోపిచంద్ మలినేని ఈ సినిమాను ఒక రొమాంటిక్ ఎంటర్టయినర్ గా మలుస్తున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ కూడా చాలా హాట్ అండ్ బోల్డ్ గా కనిపిస్తుందట. స్వతాహాగా ఆమె మోడల్.. పైగా మిస్ ఇండియా వంటి కాంటెస్టుల్లో కూడా పాల్గొంది కాబట్టి.. ఆమెకు ఈ రోల్ కొట్టిన పిండేలే అంటున్నారు సన్నిహితులు. అది సంగతి.