Begin typing your search above and press return to search.

గుర్రాలతో ఎమోషన్.. హీరోయిన్లతో రిలేషన్

By:  Tupaki Desk   |   19 Feb 2017 5:39 AM GMT
గుర్రాలతో ఎమోషన్.. హీరోయిన్లతో రిలేషన్
X
సాయిధరంతేజ్ కొత్త సినిమా విన్నర్ ఈ నెల 24న విడుదల కాబోతోంది. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందిన ఈ మూవీ.. తేజు కెరీర్ లో అతి ఎక్కువ బడ్జెట్ రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచిన సాయిధరం తేజ్.. సినిమాతో పాటు పర్సనల్ కబుర్లు కూడా చెబుతున్నాడు.

'విన్నర్ కోసం టర్కీలో షూటింగ్ చేశాం. ఇక్కడి హిప్పోడ్రోమ్ లో ఉన్న ఫెసిలిటీస్ మన దగ్గర కనిపించవు. నేను హార్స్ రైడింగ్ హైద్రాబాద్ లో నేర్చుకున్నా. టర్కీలో 18 సంవత్సరాల వయసున్న టోరా అనే గుర్రాన్ని రైడ్ చేశాను. దానికి సినిమాలతో 16 సంవత్సరాల అనుబంధం ఉంది. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే అది పరిగెట్టడం మొదలుపెడుతుంది. ఒకసారి నేను పడిపోయినపుడు.. నా ప్రాణం కాపాడేందుకు సడెన్ గా ఆగిపోయి మిగతా గుర్రాలకు అడ్డంగా నుంచుంది. గుర్రాలకు కూడా ఎమోషన్స్  ఆ స్థాయిలో ఉంటాయి. టర్కీ వదిలి వచ్చేటపుడు నా కళ్లు నీళ్లతో నిండిపోయాయి' అని చెప్పాడు సాయి ధరం తేజ్.

తనపై హీరోయిన్లతో కలిపి వచ్చే రూమర్స్ పై కూడా స్పందించాడు తేజు. 'నేను రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. నేను.. సందీప్ కిషన్.. రాశి ఖన్నా.. రెజీనా.. నవీన్ కృష్ణ.. అందరం తరచుగా కలిసి ఎంజాయ్ చేస్తుంటాం. రకుల్.. నేను ఒకే రకమైన ఫుడ్ ఇష్టపడతాం. మా ఆలోచనలు కూడా కలుస్తాయి. నేను నాతో పని చేసిన అందరు కో-స్టార్లతోను ఒకేలా ఉంటాను. నేను ఎవరితో అయినా రిలేషన్ లో ఉంటే చెప్పేందుకు నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు వస్తున్న రూమర్స్ కారణంగా.. కాలేజ్ టైం నుంచి ఉన్న నా గాళ్ ఫ్రెండ్ ఇప్పుడు నాతో మాట్లాడ్డం మానేసింది' అని చెప్పాడు తేజు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/