Begin typing your search above and press return to search.

నేను చేయను.. చరణ్‌ చేయాలి

By:  Tupaki Desk   |   28 May 2016 9:30 AM GMT
నేను చేయను.. చరణ్‌ చేయాలి
X
ఇప్పటివరకు మెగా మేనల్లుడు సాయిదరమ్‌ తేజ్‌ చాలా కాంట్రోవర్సీలకు కేంద్ర బింధువు అయిపోయాడు. అలాంటి వాటిలో ఒకటి.. మనోడు రామ్‌ చరణ్‌ చేద్దాం అనుకున్న సినిమాలను రీమేక్‌ చేసేద్దామని.. అలాగని చరణ్‌ చేద్దాం అనుకున్న రీమిక్స్ పాటలను తానే వాడేస్తున్నాడని ఆ రూమర్‌ సారంశం. అయితే ఇందులో నిజమెంత ఉంది?

టాలీవుడ్‌ టాప్‌ హీరోస్ లో మీకు నచ్చిన ఫేవరేట్‌ సినిమాలేంటి అని ఒక రీసెంట్‌ ఇంటర్యూలో అడిగితే.. ''చిరంజీవి గారివి దాదాపు అన్నీ ఇష్టమే. కాకపోతే కొండవీటి దొంగ.. గ్యాంగ్‌ లీడర్‌.. చాలా స్పెషల్‌. అలాగే నాగార్జున గారి సినిమాల్లో నిన్నేపెళ్ళాడుతా. బాలయ్య గారి సినిమాల్లో రౌడీ ఇన్సపెక్టర్‌.. భైరవద్వీపం.. వెంకటేష్‌ గారి సినిమాల్లో చంటి'' అంటూ చాలా చెప్పుకొచ్చాడు సాయిధరమ్‌ తేజ్‌. ఎలాగో గ్యాంగ్‌ లీడర్ అన్నావ్‌ కదా.. ఆ సినిమాను రీమేక్‌ చేస్తావ మరి? అని అడిగితే.. తేజు ఏమన్నాడంటే..

''గ్యాంగ్‌ లీడర్ అనేది చరణ్‌ చేయాల్సిన సినిమా. అది చరణ్‌ చేయాల్సిందే. చేస్తాడు కూడా. నేను అస్సలు టచ్‌ కూడా చేయను. అలాంటి ఉద్దేశ్యం కూడా లేదు నాకు'' అని సెలవిచ్చాడు మెగా మేనల్లుడు. ''నేను చేయను. చరణ్‌ చేస్తాడంతే'' అని మరోసారి చెప్పాడు. గతంలో ఈ సినిమా గురించి అల్లు అర్జున్ కూడా ఇదే విధంగా చెప్పాడు. వింటున్నావా చెర్రీ?