చిన్న మేనల్లుడి కోసం పవన్ తాపత్రేయం!

Wed Oct 18 2017 13:55:09 GMT+0530 (IST)

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీల హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా స్టార్ చిరంజీవి నుంచి మొదలుకొని సాయి ధరమ్ తేజ్ వరకు ఆ ఫ్యామిలీ నుంచి చాలా మంది మెగా హీరోలు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు. తాజాగా ఆ ఫ్యామిలీ నుంచి మరో మెగా హీరో తెరంగేట్రం చేయబోతున్నట్లు సమాచారం. యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ను లాంచ్ చేసేందుకు మెగా ఫ్యామిలీ సన్నాహాలు చేస్తోంది. గతంలో సాయిధరమ్ తేజ్ తెరంగేట్రం వెనుక ఆయన చిన మేనమామ పవన్ కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. అదేవిధంగా వైష్ణవ్ తేజ్ లాంచింగ్ ఈవెంట్ కూడా పవన్ చేతుల మీదుగా ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.తన చిన్న మేనల్లుడి తెరంగేట్ర చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ లను పవన్ విని వాటిలో ఒకటి ఫైనల్ చేస్తారట. పవన్ ఓకే అన్న తర్వాత 2018లో ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఈ లోపు వైష్ణవ్ నటన - డ్యాన్స్ - మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ అంటే అమితాసక్తి ఉన్న పవన్..వైష్ణవ్ ను కూడా నేర్చుకోమని సూచించారట. ఓ వైపు జనసేన  పార్టీ కార్యక్రమాలతో పాటు తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ తన మేనల్లుడి కోసం కొద్దిగా సమయాన్ని కేటాయించడం విశేషం. తెర వెనుకు పవన్ ఉండడంతో వైష్ణవ్ తొలి సినిమాతోనే హిట్ కొడతాడని టాలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.