Begin typing your search above and press return to search.

తేజు జవాన్ కాదా? అయితే కష్టమే

By:  Tupaki Desk   |   20 Oct 2017 9:54 AM GMT
తేజు జవాన్ కాదా? అయితే కష్టమే
X
మెగా హీరోలందరూ ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలను తీస్తున్నారు. అభిమానులు కూడా మెగా సినిమాల కోసం చాలా ఎదురుచూస్తున్నారు. అయితే వీరందరిలో సాయి ధరమ్ తేజ్ మాత్రం అభిమానులను గత కొంత కాలంగా కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఎంతో నమ్మకంతో మొదలు పెట్టిన జవాన్ సినిమా రిలీజ్ డేట్ మూడు నెలల నుంచి మారుతూ వస్తూనే ఉంది.

అయితే ఫైనల్ గా సినిమాను డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ తెలిపింది. రచయిత బివిఎస్ రవి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాపై ప్రస్తుతం మరొక వార్త చాలా హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో సాయి జవాన్ గా కనిపిస్తాడు అనుకున్నారు కానీ ఈ మెగా హీరో RSS మెంబర్ గా కనిపించబోతున్నాడట. RSS హిందు మతం అలాగే సంస్కృతి పరిరక్షణ కోసం అప్పట్లో బీజేపీ సీనియర్ నేతలు స్థాపించిన ఒక సంస్థ. అయతే చాలా వరకు RSS పై కొంత నెగిటివ్ టాక్ ఉంది. దాని వలన హీరో ఆ పాత్ర అంటే కాస్త కష్టమే అంటున్నారు విశ్లేషకులు.

ముఖ్యంగా ముస్లిమ్ వర్గాలు RSS ను ఏ మాత్రం ఇష్టపడరు. అయితే మెగా హీరోలకి ముస్లిమ్ ఫ్యామిలిస్ నుంచి కుడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి వారికి నచ్చని పాత్రలో మెగా హీరో కనిపిస్తే మరొకసారి కూడా అతని సినిమాలు చూడటానికి ఇష్టపడరు. నెల్లూరు - కడప వంటి ప్రాంతాల్లో ముస్లింలు మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు వస్తే తప్పకుండా చూస్తారు. మరి సాయి ధరమ్ సినిమాలో హిందూవాద ప్రచార సంస్థకు అంబాసిడర్ గా ఉంటే వారు ఎంత వరకూ ఆదరిస్తారో చూడాలి.