ఫోటో స్టొరీ: మెగా ట్రెడిషనల్ మేనల్లుళ్ళు

Thu Nov 08 2018 11:23:46 GMT+0530 (IST)

మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్.. తమ్ముడు వైష్ణవ్ తేజ్ లు ఇద్దరూ ఓ సూపర్ పోజిచ్చారు.  ఇద్దరూ తెల్ల చొక్కాలు.. తెల్ల పంచెలు కట్టి అమ్మగారు విజయదుర్గకు అటువైపు ఒకరు.. ఇటువైపు ఒకరు తెలుగు సైనికుల్లా నిలబడ్డారు. ఇక అందరూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం విశేషం.  పండగంతా వారిదగ్గరే ఉందంటే నమ్మండి!మరో ఫోటోలో తమ పెంపుడు కుక్క తో కలిసి ఫోటో తీయించుకున్నారు. ఇక ఇద్దరూ తనయులు విడివిడిగా అమ్మగారితో కలిసి ప్రేమగా వేరే ఫోటోలు తీసుకున్నారు.  ఈ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి.. "మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు #హ్యాపీ దీపావళి" అంటూ ట్వీట్ చేశాడు సాయి ధరమ్. ఎంత సెలబ్రిటీలయినా ఇంట్లో అమ్మతో సమయం గడిపేటప్పుడు చిన్న పిల్లలం అయిపోతాముగా.. మెగా మేనల్లుళ్ళు కూడా అందుకు మినహాయింపేమీ కాదు.

సినిమాల విషయానికి వస్తే తేజూ ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్ర లహరి' అనే సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకు నిర్మాతలు.  మరోవైపు తేజూ తమ్ముడు వైష్ణవ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.  ఈ సినిమాను కూడా మైత్రీ వారే నిర్మిస్తుండడం విశేషం. త్వరలో ఈ సినిమాను లాంచ్ చేస్తారట.