Begin typing your search above and press return to search.

ఆత్రేయ కోసం సుప్రీమ్ హీరో

By:  Tupaki Desk   |   18 Jun 2019 7:42 AM GMT
ఆత్రేయ కోసం సుప్రీమ్ హీరో
X
ఈ వారం 21న విడుదల కాబోతున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ లో జరగనుంది. స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి శృతి శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి మార్క్ కె రాబిన్ సంగీతం. ఈ రోజు జరగబోయే వేడుకకు ముఖ్య అతిధిగా రాబోతున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

చిత్రలహరి సక్సెస్ తర్వాత కొంత రిలీఫ్ అవుతున్న ఈ మెగా హీరో త్వరలో ప్రారంభం కాబోయే ప్రతిరోజు పండగేకు రెడీ అవుతున్నాడు. మారుతీ దర్శకత్వంలో ఇప్పటికే స్క్రిప్ట్ ని రెడీ చేసి పెట్టారు. చిత్రలహరి నుంచి గెడ్డం లుక్ లోనే కనిపిస్తున్న సాయి తేజ్ దాన్ని పూర్తిగా తీసి ఒరిజినల్ లుక్ లో అటెండ్ అవుతున్న సినిమా ఫంక్షన్ ఇదే. మొన్నో మాల్ లో కనిపించాడు కానీ అది మూవీ ఫంక్షన్ కాదు

కొత్తవాళ్లతో వస్తున్న ఏజెంట్ ఆత్రేయ ఇప్పటికే ట్రైలర్ రూపంలో మంచి స్పందన దక్కించుకుంది. కామెడీతో సాగుతూనే సీరియస్ టర్న్ తీసుకునే స్పై థ్రిల్లర్ గా దీన్ని రూపొందించారు. ఇప్పుడు జరగబోయే ఈవెంట్ తో బజ్ ఇంకాస్త పెరుగుతుందనే అంచనాలో ఉంది టీమ్. అదే రోజు చిన్న సినిమాల మధ్య పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ ఇది మెప్పిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు స్వరూప్. నెల్లూరులో ఉండే ఓ ప్రైవేట్ డిటెక్టీవ్ తన స్థాయికి మించిన కేసు వచ్చినప్పుడు దాన్ని తనదైన శైలిలో ఎలా డీల్ చేసాడనే పాయింట్ తో ఈ ఏజెంట్ ఆత్రేయ వస్తున్నాడు. మరి సుప్రీమ్ సపోర్ట్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో ఇంకో మూడు రోజుల్లో తేలనుంది