Begin typing your search above and press return to search.

వంశీని మెగా హీరో ఆదుకుంటాడా?

By:  Tupaki Desk   |   24 April 2017 9:03 AM GMT
వంశీని మెగా హీరో ఆదుకుంటాడా?
X
కృష్ణవంశీ ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అని తెలుగు ఆడియన్స్ తో పిలిపించుకున్నాడు. ఓ దశాబ్ద కాలంగా ఈయన సినిమాల తీరు చూసి.. నిరుత్సాహపడ్డమే కాదు.. జనాలు భయపడుతున్నారు కూడా. అలాంటి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన 'గోవిందుడు అందరివాడేలే' కృష్ణవంశీకి పెద్ద రిలీఫ్. ఈ సినిమా హిట్ పట్టాలెక్కలేదు కానీ.. ఫ్లాప్ మాత్రం కాలేదు.

మెగా హీరో ఇచ్చిన ఊపుతో నక్షత్రం అంటూ మళ్లీ తన స్టైల్ లో ఓ మూవీ మొదలుపెట్టేశాడు కృష్ణవంశీ. ఈ సినిమాకి 10 ఫస్ట్ లుక్స్ అంటూ.. ఒక్కోటి చొప్పున రామ్ చరణ్ తోనే రిలీజ్ చేయించాడు. అంతే.. కథ అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడీ సినిమా రిలీజ్ చేసుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. కృష్ణ వంశీ ట్రాక్ రికార్డ్.. సందీప్ కిషన్ ప్రస్తుత ఫామ్.. బయ్యర్లను ఆందోళన పెడుతున్నాయి. అందుకే మరోసారి మెగాహీరోపై డిపెండ్ అవుతున్న కృష్ణ వంశీ.. నక్షత్రంలో తేజు రోల్ ను కొనసాగించేస్తున్నాడు.

మొదట 20 నిమిషాలు అనుకున్న సాయిధరం తేజ్ రోల్ ఇప్పుడు 40 నిమిషాలకు పెంచారట. అంతే కాదు.. తేజుతో ఓ స్పెషల్ సాంగ్ కూడా పిక్చరైజేషన్ పూర్తి చేస్తున్నారు. అంతఃపురం మూవీలో జగపతి బాబు చేసిన రేంజ్ లో.. సినిమాని నిలబెట్టే రోల్ ఇది అంటున్నారు. నక్షత్రాన్ని ఆదుకునే బాధ్యత సాయిధరం తేజ్ చేతిలో పెట్టేశాడు కృష్ణవంశీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/