Begin typing your search above and press return to search.

నిరుద్యోగం వల్లే సినిమాల్లోకి మెగా హీరో

By:  Tupaki Desk   |   17 Oct 2017 1:51 PM GMT
నిరుద్యోగం వల్లే సినిమాల్లోకి మెగా హీరో
X
ఒకప్పుడు స్టార్ హీరోలకు అభిమానులకు చాలా గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు ఆదరించిన ప్రేక్షకుల కోసం రెండు నిముషాలు మాట్లాడితే వారికి వ్యక్తిగతంగా కూడా కాస్త దగ్గర అవ్వొచ్చు అనేలా మన హీరోలు సోషల్ మీడియా ద్వారా చాలా దగ్గరవుతున్నారు. రీసెంట్ గా అదే తరహాలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ఫెస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సంభాషణలో అనేక విషయాలను సాయి బయటపెట్టాడు.

ప్రస్తుతం చేస్తున్న జవాన్ సినిమా త్వరలోనే రిలీజ్ చేస్తానని. మరి కొన్ని రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి చెబుతాని చెప్పాడు. అదే విధంగా ఇతర హీరోలతో కూడా మల్టి స్టారర్ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో చిన్న పాత్ర వచ్చిన సంతోషమే అని చెప్పాడు. అదే విధంగా కథ నచ్చితే విలన్ పాత్రలు కూడా చేస్తానని చెబుతూ.. డ్యూయల్ రోల్ చేయడానికి కూడా సిద్దమే అన్నాడు. ఇక వివి వినాయక్ సినిమాలో డ్యూయల్ రోల్ కాదని చెప్పాడు. రవి తేజ - ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని రాజా ది గ్రేట్ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాని వచ్చిన వార్తలు అబద్ధమని సాయి క్లారిటీ ఇచ్చాడు.

ఇక మహేష్ అన్న అంటే కూడా చాలా ఇష్టమని 'ఈ తరానికి సూపర్‌స్టార్‌. మంచి సినిమాలు చేస్తారు. ఏదన్నా కొత్తగా చేయాలనుకుంటారు' అని చెప్పాడు. రీమేక్ సినిమాలు నచ్చితే చేస్తానని చెప్పిన సాయి తొలి ప్రేమ మళ్లీ రీమేక్ చేస్తారా ఆంటీ.. అలాంటి క్లాసీ సినిమాలు నేను చేయలేను అని సమాధానమిచ్చాడు. ఇక వెన్నల కిశోర్‌ - సత్య - వైవా హర్ష అంటే చాలా ఇష్టం. వారితో నాకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. ఫైనల్ గా చిరంజీవి అంటే తనకు దేవుడితో సమానమని ఆయన వల్లే చిత్రపరిశ్రమలో ఉన్నాను. ఆయన వల్లే బతికే ఉన్నాను అని చెబుతూ.. సినిమాల్లోకి రావడానికి గలకరణం నిరుద్యోగమని చెప్పాడు.