సాయి కూడా సాఫ్ట్ వేరేనా??

Thu Dec 07 2017 16:59:42 GMT+0530 (IST)

ఒక స్టార్ హీరో ఓ స్టైల్ ని ఫాలో అయ్యాడు అంటే నెక్స్ట్ ఎవరైన ఆ సినిమాలోని అసలు స్టిల్స్ ని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు అనుకోని చేస్తున్నారో లేక అనుకోకుండా చేస్తున్నారో గాని ఒక ఫ్యామిలీ కి చెందిన స్టార్ హీరోలు మాత్రం ఒక క్యారెక్టర్ ని బాగా వాడుతున్నారు. అదే సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గా.. వారు ఎవరో కాదు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలే అవ్వడం విశేషం.మొదట వరుస హిట్స్ అందుకున్న హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత కథల లోపం వల్ల డిజాస్టర్ ట్రాక్ లొనే నడుస్తున్నాడు.  రీసెంట్ గా వచ్చిన జవాన్ సినిమా కూడా అంతగా ఏమి ఆకట్టుకోలేదు. అయితే నెక్స్ట్  ఎలాగైనా హిట్ కొట్టాలని  సాయి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం వివి.వినాయక్ తో ఈ సుప్రీమ్ హీరో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సాఫ్ట్ వీవెర్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడుట.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో ఐటి ఉద్యోగి పాత్రని చేయగా .. రామ్ చరణ్ - నాయక్ సినిమాలో సాఫ్ట్ వెర్ ఫీల్డ్ లో ఉండే వ్యక్తిగా దర్శనం ఇచ్చాడు. ఇక అల్లు అర్జున్ లాంటి స్టైయిలిష్ స్టార్ కూడా ఆర్య 2 లో సాఫ్ట్ వేర్  ఉద్యోగిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే తరహాలో సాయి ధరమ్ తేజ్ కూడా సినిమాలో అదే జాబ్ చేసుకుంటూ.. ఆ ఫీల్డ్ ఎలా ఉంటుందా అని టేస్ట్ చేస్తున్నాడు. మరి ఇతర మెగా హీరోలు సక్సెస్ అయినట్టుగా అల్లుడు సాయి కూడా సక్సెస్ అవుతాదో లేదో చూడాలి.