గీత సాక్షిగా అంటున్న సాయిధరమ్ తేజ్

Thu Jul 12 2018 18:36:36 GMT+0530 (IST)

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కి ఈమధ్య వరుసగా పరాజయాలే. మొన్ననే విడుదలైన `తేజ్` కొద్దిలో కొద్దిగా ఉపశమనాన్నిచ్చింది. పరాజయాల మాటేమో కానీ దర్శకులు మాత్రం సాయిని దృష్టిలో ఉంచుకొని కథలు సిద్ధం చేస్తూనే ఉన్నారు.  యువ కథానాయకుల్లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. తాజాగా ఆయనొక ఆసక్తికరమైన కథకి ఓకే చెప్పినట్టు సమాచారం. గోపాల్ అనే ఓ కొత్త దర్శకుడు తేజ్‌ని దృష్టిలో ఉంచుకొని `భగవద్గీత సాక్షిగా`  పేరుతో ఓ కథని సిద్ధం చేసి వినిపించాడట.అది తేజ్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలిసింది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ కథ అని సమాచారం. ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. భగవద్గీత సాక్షిగా అనే పేరే ఆసక్తిని రేకెత్తిస్తోంది. భగవద్గీతని మనం గీత అని కూడా అంటుంటాం.  మరి ఈ గీత సాయిధరమ్ తేజ్ కెరీర్ రాతని కొత్తగా మారుస్తుందేమో చూడాలి. అన్నట్టు తేజ్ ప్రస్తుతం చిత్రలహరి చిత్రం కోసం రంగంలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి తెరకెక్కబోతోంది.  ఇందులో హలో భామ కళ్యాణి ప్రియదర్శన్ - అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తారని తెలుస్తోంది