Begin typing your search above and press return to search.

చిరు డైరెక్టర్ తో మెగా మేనల్లుడు ఫిక్స్

By:  Tupaki Desk   |   28 May 2017 7:22 AM GMT
చిరు డైరెక్టర్ తో మెగా మేనల్లుడు ఫిక్స్
X
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150ని అద్భుతంగా తెరకెక్కించి.. ఓ మాస్ మూవీతో 100 కోట్ల షేర్ మార్క్ ను అందుకోవచ్చని ప్రూవ్ చేశాడు దర్శకుడు వివి వినాయక్. ఖైదీ ఆ స్థాయిలో ఘన విజయం సాధించడంలో వినాయక్ ట్యాలెంట్ కచ్చితంగా ఉంటుంది. అయితే.. ఆ సినిమా వచ్చి నాలుగున్నర నెలలు గడిచిపోయినా.. వినాయక్ తర్వాతి సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు.

మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తో వివి వినాయక్ మూవీ అంటూ గతంలో వార్తలొచ్చాయి కానీ.. ఇప్పుడీ ప్రాజెక్ట్ కన్ఫాం అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇప్పటికే ఓ మాంచి యూత్ సబ్జెక్టును రెడీ చేసుకున్న వినాయక్.. తేజుతో డిస్కషన్స్ పూర్తి చేసేశాడట. ప్రస్తుతం ఆ స్టోరీకి తన అసిస్టెంట్స్ తో కలిసి తనదైన స్టైల్ లోకి మార్చుకుంటూ మెరుగులు దిద్దుతున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలుండగా.. ఇప్పటికే హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసేశారట.

వినాయక్ మూవీలో సాయి ధరం తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే అల్లు శిరీష్.. వరుణ్ తేజ్ లను కవర్ చేసిన లావణ్య త్రిపాఠికి.. ఇప్పుడు మెగా కాంపౌండ్ లో మూడో సినిమా ఛాన్స్ వచ్చిందని టాక్. మరోవైపు.. బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్.. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్న తేజుకు.. తొలిసారిగా టాప్ రేంజ్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ తో చేసే అవకాశం రావడం.. కచ్చితంగా ఈ మెగా హీరోకు కెరీర్ టర్నింగ్ పాయింట్ అనాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/